SRH Playoffs: టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. నిరంతర వర్షం కారణంగా మైదానం మొత్తం కవర్లతో కప్పారు.
- By Gopichand Published Date - 07:54 AM, Fri - 17 May 24

SRH Playoffs: సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. నిరంతర వర్షం కారణంగా మైదానం మొత్తం కవర్లతో కప్పారు. రాత్రి 10.30 వరకు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీని కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, గుజరాత్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా భారీ వర్షం కారణంగా టాస్ కూడా వేయకుండా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే చివరిసారిగా రాత్రి 10:30 గంటలకు వర్షం ఆగితే రెండు జట్ల మధ్య ఐదు- ఐదు ఓవర్ల మ్యాచ్ జరుగుతుందని నిర్ణయించారు. కానీ 10:30 గంటలకు మ్యాచ్ రద్దు అయినట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో హైదరాబాద్ జట్టు ఐపీఎల్ ప్లేఆఫ్స్ (SRH Playoffs)కు చేరిన మూడో జట్టుగా నిలిచింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో మరో రెండు జట్లు ఇంటి బాట పట్టాయి. ప్లేఆఫ్స్ గురించి మాట్లాడుకుంటే.. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ డైలమాలో కూరుకుపోయాయి. DC ప్రస్తుతం 14 పాయింట్లను కలిగి ఉంది. LSG కూడా లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో గెలవడం ద్వారా 14 పాయింట్లను పొందవచ్చు. కానీ గుజరాత్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఎస్‌ఆర్‌హెచ్‌కి ఒక పాయింట్ లభించడంతో మొత్తం 15 పాయింట్లకు చేరుకుంది. ఢిల్లీ, లక్నో 15 పాయింట్లను చేరుకోలేనందున హైదరాబాద్ ఇప్పుడు IPL 2024 ప్లేఆఫ్స్‌కు వెళ్ళిన మూడవ జట్టుగా అవతరించింది. అంతకు ముందు కేకేఆర్ (19), రాజస్థాన్ రాయల్స్ (16)లు ఇప్పటికే టాప్-4లో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నాయి.
Also Read: Anushka Shetty Marriage : ఆ నిర్మాతతో పెళ్లికి సిద్ధమైన అనుష్క శెట్టి.. అందుకే ఇలా చేస్తుంది అంటూ..!
వర్షం కారణంగా మ్యాచ్ అధికారులు ఓవర్ల సంఖ్యను తగ్గించడం ప్రారంభించారు. మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశాలు తగ్గిపోవడంతో చాలా మంది అభిమానులు మైదానాన్ని వీడారు. కాగా, ప్రేక్షకులను అలరించేందుకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో లైట్ షోను ఏర్పాటు చేశారు. గ్రౌండ్‌లో చీకట్లు కమ్ముకున్న పరిస్థితిలో లైట్ షో గ్రౌండ్‌లో డిస్కో బార్ అనుభూతిని కలిగించింది. గ్రౌండ్‌లో ఉన్న ప్రజలు తమ మొబైల్‌ల ఫ్లాష్‌లైట్‌లను వెలిగించి ఈ క్షణాన్ని రెట్టింపు చేశారు.
We’re now on WhatsApp : Click to Join