Anushka Shetty Marriage : ఆ నిర్మాతతో పెళ్లికి సిద్ధమైన అనుష్క శెట్టి.. అందుకే ఇలా చేస్తుంది అంటూ..!
Anushka Shetty Marriage సౌత్ సినీ పరిశ్రమలో అనుష్క శెట్టి క్రేజ్ గురించి తెలిసిందే. సూపర్ సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడు యువ హీరోలతో నటిస్తూ స్టార్ క్రేజ్ తెచ్చుకుంది.
- By Ramesh Published Date - 05:55 AM, Fri - 17 May 24

Anushka Shetty Marriage సౌత్ సినీ పరిశ్రమలో అనుష్క శెట్టి క్రేజ్ గురించి తెలిసిందే. సూపర్ సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడు యువ హీరోలతో నటిస్తూ స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. స్టార్స్ అందరితో నటించి సౌత్ లో తిరిగు లేని క్రేజ్ ఏర్పరచుకుంది. కేవలం కమర్షియల్ సినిమాలే కాదు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు కూడా అనుష్క ది బెస్ట్ అనిపించుకుంది. అరుంథతి, రుద్రమదేవి, భాగమతి సినిమాలు అనుష్క కోసమే తీశారా అన్నట్టుగా ఉంటుంది. వరుస సినిమాలు చేయకపోయినా ఇప్పటికీ అనుష్క పాపులారిటీ అదే రేంజ్ లో ఉంది.
నిశ్శబ్ధం సినిమా తర్వాత దాదాపు 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్న అనుష్క లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది. ఆ సినిమా తర్వాత ఈమధ్యనే క్రిష్ డైరెక్షన్ లో సినిమాకు సైన్ చేసింది. దీనితో పాటుగా మలయాళంలో ఒక సినిమా చేస్తుంది అనుష్క. ఇదిలాఉంటే అనుష్క కాస్త యాక్టివ్ కాగానే ఆమె పెళ్లి గురించి ఏదో ఒక వార్త వినపడుతుంది.
లేటెస్ట్ గా మరోసారి అనుష్క పెళ్లి వార్త హల్ చల్ చేస్తుంది. ఈసారి కన్నడ నిర్మాతతో అనుష్క శెట్టి మ్యారేజ్ అంటూ వార్తలు వస్తున్నాయి. కన్నడ లో ఇంకా పెళ్లి కానీ 40 ప్లస్ ఏజ్ ప్రొడ్యూసర్ అనుష్క తో పెళ్లి ప్రపోజల్ పెట్టాడని. అతనితో పెళ్లాడేందుకు అనుష్క కూడా ఓకే అన్నట్టు చెబుతున్నారు. అయితే ఎలాగు నిర్మాత కాబట్టి సినిమాల విషయంలో పెద్దగా రిస్టిక్షన్స్ పెట్టే ఛాన్స్ లేదని చెప్పొచ్చు. మరి నిజంగానే అనుష్క నిర్మాతను పెళ్లాడుతుందా లేదా అన్నది చూడాలి.
Also Read : Samantha : అతనికి బర్త్ డే విష్ చేసి ఐలవ్యూ చెప్పిన సమంత..!