Aiden Markram: సౌతాఫ్రికా ఇజ్జత్ కాపాడిన మార్క్రామ్
Aiden Markram: ఆఫ్ఘనిస్తాన్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఐడెన్ మార్క్రామ్ అజేయంగా స్కోర్ చేయడం ద్వారా ఇన్నింగ్స్‌ను చేజిక్కించుకున్నాడు. 67 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించి జట్టును అవమానం నుంచి కాపాడాడు.
- By Praveen Aluthuru Published Date - 11:58 AM, Mon - 23 September 24

Aiden Markram: ఆఫ్ఘనిస్తాన్ మరియు సౌతాఫ్రికా (AFG Vs SA) మధ్య 3 వన్డేల సిరీస్ ముగిసింది. తొలి రెండు వన్డేల్లో సత్తా చాటిన అఫ్గానిస్థాన్ మూడో వన్డేలోను దక్షిణాఫ్రికాపై గెలిచి 3-0 తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనుకుంది. కానీ ఐడెన్ మార్క్రామ్ (miden markram:) ఆఫ్ఘన్ జోరుకు బ్రేకులు వేశాడు.. లేదంటే ఆఫ్ఘనిస్థాన్ 3-0తో ఆధిక్యాన్ని సంపాదించి ఉండేది. మూడో వన్డేలో సౌతాఫ్రికాకు ఆఫ్ఘనిస్తాన్ 170 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. మ్యాచ్ ప్రారంభంలో ఈ లక్ష్యం తేలికగా అనిపించింది. కానీ సౌతాఫ్రికా 80 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని భారంగా మార్చుకుంది.
ఐడెన్ మార్క్రామ్ అజేయంగా స్కోర్ చేయడం ద్వారా ఇన్నింగ్స్‌ను చేజిక్కించుకున్నాడు. 67 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించి జట్టును అవమానం నుంచి కాపాడాడు. మార్క్రామ్‌కి ట్రిస్టన్ స్టబ్స్ నుండి మంచి మద్దతు లభించింది. ఫలితంగా సౌత్ ఆఫ్రికా 33 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. రెండో వన్డేలో సెంచరీ సాధించిన ఆఫ్ఘన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఈ మ్యాచ్ లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఒంటిచేత్తో పోరాడాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆఫ్రికన్ బౌలర్లను సునాయాసంగా ఆడిన గుర్బాజ్ బలహీన బంతులను బౌండరీకి పంపాడు. గుర్బాజ్ 94 బంతుల్లో 4 సిక్సర్లు, 7 ఫోర్లతో 89 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా దక్కింది. అయితే గుర్బాజ్ 89 పరుగులు సాధించినప్పటికీ మిగతా ప్లేయర్లు రాణించకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ 34 ఓవర్లలో 169 పరుగులకే కుప్పకూలింది.
గుర్బాజ్‌తో పాటు అల్లా గజ్నాఫర్ 15 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఈ ఆటగాడు 3 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టాడు. కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ 10 పరుగులు చేశాడు. ఇది కాకుండా ఏ బ్యాట్స్‌మెన్ కూడా రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. మొత్తానికి సౌతాఫ్రికా లాంటి బలమైన జట్టు ఆఫ్ఘన్ చేతిలో పూర్తిగా నష్టపోకుండా పరువు కాపాడుకుంది. దీంతో ఐడెన్ మార్క్రామ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.నెమ్మదిగా ఆడుతూ కనిపించినప్పటికీ కీలక ఇన్నింగ్స్ ను చక్కదిద్ది జట్టును ముందుకు నడిపించాడు.
Also Read: HYDRA Demolishing @ Kavuri Hills Park : కావూరి హిల్స్ లో అక్రమాలను కూల్చేస్తున్న ‘హైడ్రా’