HYDRA Demolishing @ Kavuri Hills Park : కావూరి హిల్స్ లో అక్రమాలను కూల్చేస్తున్న ‘హైడ్రా’
Hydraa - Kavuri Hills : కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో అక్రమ షెడ్లను కూల్చేశారు
- By Sudheer Published Date - 11:47 AM, Mon - 23 September 24

‘హైడ్రా’ (HYDRA ) తగ్గేదేలే అంటూ అక్రమ కట్టడాలను కూల్చేస్తు (Demolishing ) అక్రమరాయుళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ప్రభుత్వ స్థలాలు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చేసి పనిలో పడింది. గత కొద్దీ రోజులుగా నగరవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను కొలుస్తూ వస్తుంది. నిన్న కూకట్పల్లి నల్ల చెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, సర్వే నెంబర్ 66, 67, 68, 69లో 16 కమర్షియల్ షెడ్లు, ప్రహరీ గోడలను కూల్చివేసి 4 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. అలాగే అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి వ్యాపార కార్యకలాపాల కోసం భవనాలను నిర్మించగా వాటిని కూల్చేసింది.
ఇక ఈరోజు..సోమవారం మాదాపూర్‌లోని కావూరి హిల్స్ పార్కు (Kavuri Hills Park) స్థలంలోని అక్రమ షెడ్లను హైడ్రా కూల్చేసింది. ఇక్కడ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేశారు. ఈ స్పోర్ట్స్ అకాడమీపై కావూరి హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో అక్రమ షెడ్లను కూల్చేశారు. ఈ అక్రమ నిర్మాణాలను తొలగించి కావూరిహిల్స్ పార్కు పేరిట బోర్డును ఏర్పాటు చేశారు. పార్కు స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. గడువు తీరకముందే అన్యాయంగా నిర్మాణాలు తొలగించారని ఆరోపించారు.
Read Also : Silk Smitha Death Anniversary : వెండితెర కన్నీటి చుక్క..’సిల్క్ స్మిత’