Manish Pandey: పాండ్యా, చాహల్ దారిలోనే మరో టీమిండియా ఆటగాడు!
ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే. 2009లో ఆర్‌సీబీ తరఫున ఆడుతూ ఈ ఘనత సాధించాడు. 2015లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు.
- By Gopichand Published Date - 10:12 AM, Fri - 10 January 25

Manish Pandey: గత కొంత కాలంగా టీమిండియా ఆటగాళ్లు విడాకులు తీసుకున్నట్లు వార్తలు ఎక్కవయ్యాయి. వారు అధికారికంగా ప్రకటించకపోయినా వారి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఈ విషయం బయటపడుతుంది. తొలుత పాండ్యా- నటాషా విడాకుల వార్తలు కూడా సోషల్ మీడియా ద్వారానే తెలిసింది. అయితే టీమిండియాలో మొదట మహ్మద్ షమీ విడాకులు తీసుకున్నాడు. దీని తర్వాత టీమిండియా ‘గబ్బర్’ శిఖర్ ధావన్ కూడా తన భార్య నుండి విడిపోయాడు. హార్దిక్ పాండ్యా, నటాషా కూడా విడిపోయారు. తాజాగా స్పిన్నర్ చాహల్ కూడా తన భార్య ధనశ్రీకి విడాకులు ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే టీమిండియాకు చెందిన మరో క్రికెటర్ బ్రేకప్ అయ్యాడనే వార్త వెలుగులోకి వచ్చింది.
ఈ ఆటగాడికి సంబంధించి ప్రశ్నలు తలెత్తాయి
నివేదికల ప్రకారం.. క్రికెటర్ మనీష్ పాండే (Manish Pandey), అతని భార్య అశ్రిత శెట్టి మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ నుండి ఫోటోలను కూడా తొలగించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. క్రికెటర్ మనీష్ పాండే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు.
Also Read: Hydra : ‘హైడ్రా’ నిర్ణయం మంచిదే.. కాకపోతే : వెంకయ్య నాయుడు
2019లో వివాహం జరిగింది
మనీష్ పాండే- అశ్రిత శెట్టి 2019లో వివాహం చేసుకున్నారు. అశ్రిత కుటుంబం కర్ణాటకకు చెందినది. ఆమె తమిళ సినిమాల్లో కూడా పనిచేసింది. పెళ్లయిన తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కూడా చాలాసార్లు కనిపించింది. కానీ ఐపీఎల్ 2024 సమయంలో ఆమె స్టేడియంలో కనిపించలేదు. మనీష్ పాండే ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భాగంగా ఉన్నాడు. ఇది కాకుండా అతని జట్టు టైటిల్ కూడా గెలుచుకుంది. దీని తర్వాత కూడా అశ్రిత సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయలేదు.
ఐపీఎల్‌లో రికార్డు సృష్టించాడు
ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే. 2009లో ఆర్‌సీబీ తరఫున ఆడుతూ ఈ ఘనత సాధించాడు. 2015లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున 29 వన్డేల్లో 566 పరుగులు, 39 టీ20ల్లో 709 పరుగులు చేశాడు.