IPL 2023 Points Table: టాప్ ప్లేస్ లో లక్నో సూపర్ జెయింట్స్
ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. టాప్ టీమ్స్ కు షాక్ లు తగులుతుంటే కొన్ని జట్లు ఇంకా బోణీ కొట్టలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది.
- By Naresh Kumar Published Date - 12:13 PM, Tue - 11 April 23
IPL 2023 Points Table: ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. టాప్ టీమ్స్ కు షాక్ లు తగులుతుంటే కొన్ని జట్లు ఇంకా బోణీ కొట్టలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చివరి బంతికి విజయం సాధించిన ఆ జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు ఒక ఓటమి లక్నో ఖాతాలో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ సెకండ్ ప్లేస్‌లో ఉండగా…రింకు సింగ్ మెరుపులతో గుజరాత్‌పై గెలిచిన కోల్‌కతా మూడో స్థానంలో నిలిచింది. ఇక డిఫెండింగ్ చాంఫియన్ గుజరాత్ టైటాన్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ అయిదో స్థానంలోనూ, పంజాబ్ కింగ్స్ ఆరో ప్లేస్ లోనూ, బెంగుళూరు ఏడో స్థానంలోనూ కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటి వరకూ తొలి విజయం సాధించని ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్లో చివరి ప్లేస్‌లో నిలిచాయి.
మరోవైపు ఆరెంజ్ క్యాప్ జాబితా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ధావన్ 3 మ్యాచుల్లో 225 పరుగులుచేశాడు. చెన్నై ఓపెనర్ రుతురాజ్ 189 పరుగులతో సెకండ్ ప్లేస్‌లో ఉండగా… డుప్లెసిస్ 175 రన్స్ తో మూడు, విరాట్ కోహ్లి 164 రన్స్ తో నాలుగో స్థానాల్లో ఉన్నారు. అటు పర్పుల్ క్యాప్ జాబితాలో లక్నో సూపర్ జాయింట్స్ పేసర్ మార్క్‌వుడ్ తొమ్మిది వికెట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. తర్వాత గుజరాత్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ రెండో ప్లేస్‌లో నిలవగా…చాహల్ 8 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. రవి బిష్ణోయ్ , అల్జారీ జోసెఫ్ ఆరేసి వికెట్లతో నాలుగు, ఐదో స్థానాల్లో కొనసాగుతున్నారు.
Related News
LSG vs RR: నేడు ఐపీఎల్లో మరో రసవత్తర పోరు.. లక్నో వర్సెస్ రాజస్థాన్..!
IPL 2024లో 44వ మ్యాచ్ శనివారం లక్నో సూపర్ జెయింట్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది.