HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Lsg Vs Rr 15 Year Old Vaibhav Sooryavanshi Creates Ipl History

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన 15 ఏళ్ల మెరుపు బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు.

  • Author : Gopi Date : 23-04-2026 - 10:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన 32వ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో పెద్దగా రాణించలేకపోయాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై వైభవ్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయినప్పటికీ ఒక భారీ రికార్డును బద్దలు కొడుతూ కొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన ఆటగాడిగా వైభ‌వ్ నిలిచాడు.

చ‌రిత్ర సృష్టించాడు

రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన 15 ఏళ్ల మెరుపు బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసినప్పటికీ దిగ్గజ ఆటగాళ్లకు కూడా సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు.

Also Read: కాపురంలో చిచ్చు పెట్టిన నైటీ..!

అత్యంత వేగంగా 500 పరుగులు పూర్తి

LSGపై ఆడుతున్న సమయంలో వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. వైభవ్ కేవలం 227 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో 250 కంటే తక్కువ బంతుల్లో 500 పరుగుల మార్కును తాకిన మొదటి ఆటగాడిగా వైభవ్ నిలిచాడు.

మాక్స్‌వెల్ రికార్డు బద్దలు

గతంలో ఈ రికార్డు గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట ఉండేది. మాక్స్‌వెల్ 260 బంతుల్లో 500 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి స్థానాల్లో ప్రియాన్ష్ ఆర్య (280 బంతులు), వీరేంద్ర సెహ్వాగ్ (280 బంతులు), నమన్ ధీర్ (283 బంతులు) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో 2 పరుగులు పూర్తి చేయగానే వైభవ్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుత ప్రదర్శన

తన అరంగేట్రం (ఐపీఎల్ 2025) సీజన్‌లోనే 252 పరుగులు చేశారు. 206.56 స్ట్రైక్ రేట్‌తో “బెస్ట్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్” అవార్డును గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ తన స్ట్రైక్ రేట్‌ను 240కి పెంచుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండు అర్ధసెంచరీలతో సహా 254 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ తర్వాత నాలుగో స్థానంలో ఉన్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fastest 500 IPL Runs
  • IPL 2026
  • IPL Records
  • Lucknow Super Giants
  • rajasthan royals
  • Vaibhav Sooryavanshi

Related News

Mukesh Choudhary

సీఎస్కే బౌల‌ర్ ఇంట విషాదం!

ఐపీఎల్ 2026 వేలానికి ముందే సీఎస్కే ముకేష్ చౌదరిని రిటైన్ చేసుకుంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ స్థానంలో అతనికి అవకాశం లభించింది.

  • MS Dhoni

    సీఎస్కేకు శుభ‌వార్త‌.. జ‌ట్టులోకి ధోనీ?

  • IPL 2026 Points Table

    ఐపీఎల్ 2026.. టాప్ ప్లేస్‌లో ఉన్న జ‌ట్టు ఏదీ?

  • Ipl 2026 Lsg Vs Rr

    IPL 2026: నేడు లక్నో vs రాజస్థాన్..గెలుపు ఎవర్ని వరిస్తుందో ?

  • Srh Win 47

    IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

Latest News

  • బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ

  • Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

  • భార‌త్‌పై ట్రంప్ చిందులు!

  • WB Polling : పోలింగ్ కేంద్రానికి వచ్చిన భారీ ఏనుగు.. పరుగులు పెట్టిన ఓటర్లు

  • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

Trending News

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd