HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hyderabads First It Tower Enters The Pages Of History

Hyderabad First IT Tower: హైదరాబాద్‌లో మొదటి ఐటీ టవర్ చరిత్ర పుటల్లోకి…

  • Author : Vamsi Chowdary Korata Date : 25-06-2026 - 2:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad's first IT tower enters the pages of history...
Hyderabad's first IT tower enters the pages of history...

నేటి తరం యువతకు ఐటీ కారిడార్, హైటెక్‌సిటీ అనగానే అందరికీ గుర్తొచ్చే ఏరియాలు మాదాపూర్, గచిబౌలి, నానక్‌రామ్‌గూడ, రాయదుర్గం. ఎటు చూసినా ఆకాశాన్ని తాకే గగనతలాలు, అత్యాధునిక గ్లాస్ బిల్డింగులే నేటి ఐటీ నగర రూపురేఖలు. కానీ.. హైదరాబాద్ నగరానికి చెందిన మొదటి తరం ఐటీ ఉద్యోగులను, అనుభవజ్ఞులను అడిగితే వారికి మొదటగా గుర్తొచ్చే ప్రాంతం బేగంపేట. ఎందుకంటే భాగ్యనగరంలో ఐటీ సామ్రాజ్యానికి తొలి పునాది ఇక్కడే పడింది. నగరంలోనే నిర్మితమైన మొట్టమొదటి ఐటీ టవర్‌గా ఖ్యాతిగాంచిన ఇంటర్‌గ్రాఫ్ కన్సల్టింగ్ భవనం పూర్తిగా కాలగర్భంలో కలిసిపోతోంది. ఆ ఐటీ భవన సముదాయాన్ని కూల్చివేసేందుకు యాజమాన్యం సిద్ధమైంది.

అమెరికాకు చెందిన ప్రముఖ సాంకేతిక సంస్థ ఇంటర్‌గ్రాఫ్ కన్సల్టింగ్ 1987లో బేగంపేటలో ఐటీ టవర్ నిర్మించింది. నగరంలో స్థాపించబడిన మొట్టమొదటి అంతర్జాతీయ బహుళజాతి సంస్థ (MNC) ఇదే కావడం విశేషం. ఐటీ రంగంలో హైదరాబాద్ పేరు గ్లోబల్ మ్యాప్‌పైకి ఎక్కడానికి ఈ సంస్థే తొలి కారణం. దశాబ్దాల పాటు ఎంతోమంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను తయారుచేసిన ఈ ఐకానిక్ భవనం ఇప్పుడు శాశ్వతంగా కనుమరుగవుతోంది. భవన భూగర్భంలో ఉన్న నీటి సంపుటి దెబ్బతినడం, పునాదులు బలహీనపడటంతో భవన భద్రతను దృష్టిలో ఉంచుకుని దానిని కూల్చివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు కూల్చివేత పనులు జరుగుతున్నట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. పాత భవనాన్ని పూర్తిగా తొలగించిన అనంతరం.. అదే స్థలంలో సరికొత్త అధునాతన కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.

మాదాపూర్‌లో సైబర్ టవర్స్‌ను నిర్మించి.. విప్రో, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ దేశీయ ఐటీ సంస్థలకు పెద్ద ఎత్తున భూములు కేటాయించేంత వరకు నగర ఐటీ రంగానికి బేగంపేట, అమీర్‌పేట ప్రాంతాలే ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. అప్పట్లో అంతర్జాతీయ ప్రయాణాలకు అత్యంత అనువుగా.. నగర నడిబొడ్డున బేగంపేట విమానాశ్రయం అందుబాటులో ఉండటం కూడా ఈ ప్రాంతం ఐటీ హబ్‌గా ఎదగడానికి ప్రధాన కారణమైంది. ఆ రోజుల్లో బ్రిగేడ్, టాటా సెర్విజోల్, విప్రో, ఎయిర్‌టెల్, ఇంటర్‌గ్రాఫ్ వంటి దిగ్గజ సంస్థలన్నీ బేగంపేట కేంద్రంగానే తమ కార్యకలాపాలను సాగించాయి.

వీటితో పాటు మేఫిర్, సిటీ సెంటర్ కాంప్లెక్స్‌లలో సత్యం కంప్యూటర్స్ సంస్థ తన కార్యకలాపాలను నడపగా.. పంజాగుట్టలో ఓఎస్‌ఐ, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో హెచ్‌ఎస్‌బీసీ, సియారా అట్లాంటిక్ సంస్థలు ఉండేవి. సోమాజిగూడ కేంద్రంగా ఏడీపీ, 24/7 కస్టమర్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు నగరంలో ఐటీ విప్లవానికి ఊతమిచ్చాయి. నాడు కొన్ని వందల మందితో ప్రారంభమైన ఐటీ ఉద్యోగుల ప్రస్థానం.. నేడు లక్షల మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరింది. ఎందరో మొదటి తరం సాఫ్ట్‌వేర్ నిపుణులకు ఉపాధినిచ్చి, జీవితాలను నిలబెట్టిన హైదరాబాద్ మొదటి ఐటీ టవర్ ఇంటర్‌గ్రాఫ్ భవనం నేడు జ్ఞాపకంగా మిగిలిపోతుండటంతో పాత తరం టెక్కీలు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Begumpet
  • demolished
  • First It Tower
  • Hyderabads
  • It Tower Intergraph

Related News

    Latest News

    • Venezuela Earthquake: భూకంపాల్లో దెబ్బతిన్న వెనిజులాకు ప్రధాని మోదీ భారీ మద్దతు.. సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని వెల్లడి

    • Hyderabad First IT Tower: హైదరాబాద్‌లో మొదటి ఐటీ టవర్ చరిత్ర పుటల్లోకి…

    • Tungabhadra: ముగ్గురు సీఎంల చేతుల మీదుగా తుంగభద్ర డ్యామ్‌కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభం

    • Ketan Agarwal: కేతన్‌ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. కేతన్ అగర్వాల్ హత్య వెనుక షాకింగ్ నిజాలు

    • Urinary tract infection: మూత్రనాళాల ఇన్ఫెక్షన్‌కు పెరుగుతో చెక్.. ఎలాగో తెలుసుకోండి!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd