HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Lsg Vs Dc Delhi Capitals Won By 6 Wkts

లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘ‌న‌విజ‌యం!

మరోవైపు, ఎయిడెన్ మార్‌క్రామ్ (11), ఆయుష్ బదోని (0), నికోలస్ పూరన్ (8) తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. లక్నో జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.

  • Author : Gopi Date : 01-04-2026 - 11:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
LSG vs DC
LSG vs DC

LSG vs DC: ఐపీఎల్ 2026 సీజన్ 5వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. ఏకానా స్టేడియంలో జరిగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 142 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఢిల్లీ జట్టు 4 వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఢిల్లీ విజయంలో సమీర్ రిజ్వీ హీరోగా నిలిచాడు. అజేయంగా 70 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి లక్నో నోటికాడ విజయాన్ని లాగేసుకున్నాడు. ఈ విజయంతో ఢిల్లీ జట్టు 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తన ఖాతాను తెరిచింది.

141 పరుగులకే కుప్పకూలిన LSG

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట లక్నో సూపర్ జెయింట్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టుకు ఆరంభం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కేవలం 19 పరుగుల వద్ద కెప్టెన్ రిషబ్ పంత్ (7 పరుగులు) రనౌట్ రూపంలో దురదృష్టవశాత్తూ మొదటి వికెట్‌గా వెనుదిరిగారు. టాప్ ఆర్డర్‌లో మిచెల్ మార్ష్ మినహా మరెవరూ రాణించలేదు. దీంతో 71 పరుగులకే సగం జట్టు పవిలియన్ చేరింది. మార్ష్ 28 బంతుల్లో 35 పరుగులు చేయగా, అబ్దుల్ సమద్ 25 బంతుల్లో 36 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు.

Also Read: ప‌శ్చిమాసియాలో యుద్ధం.. మూడు గంట‌ల‌పాటు ప్ర‌ధాని మోదీ కీల‌క స‌మావేశం!

మరోవైపు, ఎయిడెన్ మార్‌క్రామ్ (11), ఆయుష్ బదోని (0), నికోలస్ పూరన్ (8) తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. లక్నో జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఫలితంగా లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అయింది. ఢిల్లీ బౌలర్లలో లుంగీ ఎంగిడి, టి నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తలో 3 వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, కెప్టెన్ అక్షర్ పటేల్ 1 వికెట్ సాధించాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi capitals
  • IPL 2026
  • LSG vs DC
  • Rishabh Pant
  • sports news

Related News

Ipl 2026 Playoffs

IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు ఊహించని మలుపులతో అత్యంత రసవత్తరంగా మారింది. ఓటమి అంచున నిలిచి, వరుసగా మూడో పరాజయం చవిచూస్తుందనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై చివరి ఓవర్లో సాధించిన థ్రిల్లింగ్ విజయంతో సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. ఈ గెలుపుతో ఆర్సీబీ 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అదే సమయంలో ఈ ఫలితంతో ముంబై ఇం

    Latest News

    • Bandi Bagheerath: బండి భగీరథ్.. స్పందించిన బాధితురాలి తల్లి సంచలన లేఖ

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Telangana: స్టార్‌ హోటళ్లలోనూ అందుబాటులోకి తాటి కల్లు : మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

    • Amaravati: అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం

    • Pm Modi: ఇక గ్యాస్, పెట్రోల్ కష్టాలకు చెక్?

    Trending News

      • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

      • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

      • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd