Legends League Cricket 2024: ఓపెనర్లుగా గబ్బర్, యూనివర్సల్ బాస్
లెజెండ్స్ లీగ్ క్రికెట్ వేలం జరిగింది. ఈ వేలంలో గుజరాత్ జట్టు మొత్తం 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. గుజరాత్ జట్టులో శిఖర్ ధావన్ మరియు క్రిస్ గేల్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా తనదైన ముద్ర వేశాడు. గేల్ కూడా అద్భుతమైన ఓపెనర్. ఈ విధ్వంసకర బ్యాటర్లు కలిసి ఓపెనింగ్ చేయడం ఫ్యాన్స్ కు కిక్కిస్తుంది.
- By Praveen Aluthuru Published Date - 01:06 PM, Fri - 30 August 24

Legends League Cricket 2024: శిఖర్ ధావన్ ఇటీవల అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శిఖర్ ధావన్ రిటైర్మెంట్ తర్వాత లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడుతూ కనిపించనున్నాడు. తమతో పాటు శిఖర్ ధావన్‌ను కూడా గుజరాత్ జట్టు చేర్చుకుంది. క్రిస్ గేల్ కెప్టెన్సీలో శిఖర్ ధావన్ ఆడనున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ మూడో సీజన్ వేలం గురువారం న్యూఢిల్లీలో జరిగింది.
వేలం సందర్భంగా పలువురు ఆటగాళ్లపై బిడ్లు దాఖలయ్యాయి. ఈ వేలంలో గుజరాత్ జట్టు మొత్తం 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈ వేలంలో గుజరాత్ అత్యంత ఖరీదైన లియామ్ ప్లంకెట్‌ను 41.56 లక్షలకు కొనుగోలు చేసింది. వేలంలో ధావన్ పేరు తీసుకోనప్పటికీ, శిఖర్ ధావన్ కూడా ఈ జట్టుతో సంబంధం కలిగి ఉన్నాడు. ముందుగా టీమ్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, శిఖర్ ధావన్‌ను జట్టులోకి తీసుకోవడానికి గుజరాత్ ఎంత డబ్బు చెల్లించిందో ఇంకా వెల్లడించలేదు. శిఖర్ ధావన్ తొలిసారి ఈ లీగ్‌లో ఆడబోతున్నాడు.
వేలంలో లియామ్ ప్లంకెట్ ను 41.56 లక్షలకు గుజరాత్ కొనుగోలు చేసింది. అలాగే మోర్నే వాన్ వైక్ 29.29 లక్షలు, లెండిల్ సిమన్స్ 37.5 లక్షలు,అస్గర్ ఆఫ్ఘన్ 33.17 లక్షలు, జెరోమ్ టేలర్ 36.17 లక్షలు, పరాస్ ఖడ్కా 12.58 లక్షలు, సెక్కుగే ప్రసన్న 22.78 లక్షలు, కమౌ లెవెరోక్ 11 లక్షలు,సైబ్రాండ్ 15 లక్షలకు రెటైన్ చేసుకుంది. ఇదిలా ఉండగా గుజరాత్ జట్టులో శిఖర్ ధావన్ మరియు క్రిస్ గేల్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా తనదైన ముద్ర వేశాడు. రోహిత్ తో కలిసి ఓపెనర్ గా శిఖర్ ఎన్నో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఇప్పుడు ధావన్ మరోసారి ఓపెనర్ పాత్ర పోషిచబోతున్నాడు. గేల్ కూడా అద్భుతమైన ఓపెనర్. ఈ విధ్వంసకర బ్యాటర్లు కలిసి ఓపెనింగ్ చేయడం ఫ్యాన్స్ కు కిక్కిస్తుంది.
Also Read: Digital Arrest scam: డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? ఎలా చేస్తారు ?