IPL 2022 : రాయల్స్ , రైడర్స్ పోరులో పై చేయి ఎవరిదో ?
ఐపీఎల్-2022లో మరో ఉత్కంఠ భరిత పోరుకు రంగం సిద్దమైంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగనున్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు , రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది.
- By Naresh Kumar Published Date - 05:54 PM, Mon - 18 April 22

ఐపీఎల్-2022లో మరో ఉత్కంఠ భరిత పోరుకు రంగం సిద్దమైంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగనున్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు , రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. ఈ ఏడాది సీజన్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరో స్థానంలో ఉండగా.. ఐపీఎల్ 2022లో ఆడిన 5 మ్యాచుల్లో 3 విజయాలతో రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో ప్లేస్ లో నిలిచింది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలి రెండు మ్యాచ్‌ల్లలో విజయం సాధించింది. ఆ తరువాత మూడో మ్యాచ్‌లో ఓటమిపాలైనా.. ఆ తరువాత లక్నో సూపర్ కింగ్స్‌పై విజయం సాధించి మల్లి గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి చవిచూసింది. అయితే రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోష్ బట్లర్ ఒక్కడే బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు.
దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్, షిమ్రోన్ హెట్మెయిర్, రస్సీ వాన్ డెర్ డూస్సెన్..తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సిన అవసరముంది.మరోవైపు ఈ సీజన్ లో కోల్‌కత నైట్‌రైడర్స్ ఆఖరి రెండు మ్యాచ్‌లల్లో దారుణ ఓటమి పాలైంది. బ్యాటింగ్ విభాగంలో వెంకటేష్ అయ్యర్ , శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా నిలకడగా రాణించట్లేదు. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే వీరంతా సమష్టిగా రాణించాల్సిన అవసరముంది.
ఇక ఈ మ్యాచ్ లో కేకేఆర్ ను ఢీకొట్టే రాజస్థాన్ రాయల్స్ తుది జట్టులో సంజు శాంసన్ సారథిగా ఉండగా.. ఆ జట్టులో జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్ కుల్దీప్ సేన్ చోటు దక్కించుకున్నారు. అలాగే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో పోటీపడనున్న కేకేఆర్ తుది జట్టులో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ గా ఉండగా.. ఆ జట్టులో వెంకటేష్ అయ్యర్,ఆరోన్ ఫించ్, నితీష్ రాణా, షెల్డన్ జాక్సన్ , ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, అమన్ ఖాన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చోటు దక్కించుకున్నారు.