Kohli Comments: టీ20ల్లో తన రికార్డును బ్రేక్ చేసిన శుభ్ మన్ గిల్ పై కోహ్లీ సంచలన కామెంట్స్
భారత యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ (Shubman Gill) భీకర ఫామ్ లో ఉన్నాడు. న్యూజిలాండ్ తో వన్డేలో డబుల్ సెంచరీ,
- Author : Maheswara Rao Nadella
Date : 02-02-2023 - 11:55 IST
Published By : Hashtagu Telugu Desk
భారత యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ (Shubman Gill) భీకర ఫామ్ లో ఉన్నాడు. న్యూజిలాండ్ తో వన్డేలో డబుల్ సెంచరీ, మరో సెంచరీతో దంచికొట్టిన గిల్ అదే ఫామ్ ను టీ20 సిరీస్ లోనూ కొనసాగించాడు. బుధవారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మెరుపు శతకంతో చెలరేగాడు. అజేయంగా 126 పరుగులు చేసిన గిల్ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోరు నమోదు చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (122 నాటౌట్) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు ఈ ఫార్మాట్ లో శతకం సాధించిన పిన్న వయస్కుడిగానూ రికార్డు.
మెరుపులతో భారీ స్కోరు చేసిన భారత్ 168 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. టీ20ల్లో పరుగుల పరంగా అతి పెద్ద విజయం సొంతం చేసుకుంది. గిల్ తుపాన్ ఇన్నింగ్స్ కు అభిమానులతో పాటు ఆటగాళ్లూ ఫిదా అయ్యారు. టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ (Kohli) అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘స్టార్ (సితారా). భవిష్యత్ ఇక్కడే ఉంది’ అని తాను గిల్ తో కలిసున్న ఫొటోను విరాట్ కోహ్లీ (Kohli) ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
Also Read: WhatsApp Accounts Ban: ఇండియాలో 36.77 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధాస్త్రం