T20 Cup: కోహ్లీ, రోహిత్ శర్మ T20 కప్ కొట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
- By Balu J Published Date - 11:36 PM, Wed - 29 May 24

T20 Cup: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వయస్సులో సుమారు ఒకటిన్నర సంవత్సరాల తేడా ఉంది. రోహిత్ 2007లో భారత జట్టుకు అరంగేట్రం చేసాడు. కోహ్లి ఒక సంవత్సరం తర్వాత భారత జట్టుకు అరంగేట్రం చేశాడు. దీని తరువాత, వారిద్దరి క్రికెట్ ప్రయాణం కలిసి ముందుకు సాగింది. వారి జోడి మైదానంలో ఇతర జట్లకు చెమటలు పట్టించింది. ఇప్పుడు T20 ప్రపంచ కప్ 2024 వీరికి సవాలుగా మారింది. ఇది విరాట్, రోహిత్‌లకు చివరి ప్రపంచ కప్ కావచ్చు. అయితే కప్ అందించాల్సిన బాధ్యత వీరిపై ఉంది.
ఫాస్ట్ బ్యాటింగ్, పవర్ హిట్టింగ్ T20 క్రికెట్‌లో చాలా ముఖ్యం. టైమింగ్, పవర్ హిట్టింగ్ ఉంటేనే T20లో ఎక్కువ కాలం కొనసాగగలరు. అటువంటి పరిస్థితిలో, విరాట్ కోహ్లీ 117 టీ20 మ్యాచ్‌లు ఆడుతూ 51.75 సగటుతో 4,037 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో అతని స్ట్రైక్ రేట్ దాదాపు 138. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లి 140 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తే, భారత్ ఇన్నింగ్స్‌లో 250 పరుగుల ఫిగర్‌ను ఎప్పటికీ తాకదు. కోహ్లికి సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా ఉంది, అయితే అతను ఇప్పుడు స్ట్రైక్‌రేట్‌ను వేగవంతం చేయకపోతే, బహుశా అతని T20 ప్రపంచ కప్ ట్రోఫీ కల నెరవేరదు.
2023 వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌ల, రోహిత్ శర్మ టోర్నమెంట్ అంతటా దూకుడుగా ఆడాడు. చాలా మ్యాచుల్లో దూకుడుగా ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఇప్పుడు రోహిత్ T20 ప్రపంచ కప్ 2024లో అతిగా దూకుడుగా వ్యవహరించకుండా ఉండవలసి ఉంటుంది.