IPL 2025: ఐపీఎల్ లో రాహుల్, కోహ్లీ జోడి మరోసారి
గత మూడేళ్లుగా లక్నో సూపర్ జెయింట్స్‌కు సారథిగా ఉన్న కేఎల్ రాహుల్ వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందు ఆ జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. గత ఐపీఎల్ సీజన్ చివర్లో కేఎల్ రాహుల్, లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా మధ్య వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే.
- By Praveen Aluthuru Published Date - 04:18 PM, Tue - 23 July 24

IPL 2025: 2025 ఐపీఎల్ లో భారీ మార్పులు జరగనున్నట్టు ఇదివరకే చెప్పుకున్నాం. జట్టు సభ్యులు మాత్రమే కాకుండా కెప్టెన్లు కూడా మారబోతున్నారు. అన్ని జట్లలానే ఆర్సీబీ కూడా ప్రక్షాళనకు సిద్ధమైంది. వచ్చే ఏడాది కప్ కొట్టే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. నిజానికి గతేడాది ఐపీఎల్ లో ఆర్సీబీ కప్ కొట్టే అవకాశాన్నీ తృటిలో మిస్ చేసుకుంది. చెన్నైపై గెలిచిన ఆర్సీబీ రాజస్థాన్ పై ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ సీజన్లో ఎలాగైనా కప్ కొట్టాలన్న కసితో ఉన్న ఆ జట్టు ఆ దిశగానే జట్టులో ప్రక్షాళనకు సిద్ధమైంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ జట్టులోకి కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్ రాబోతున్నాడు. ఇదే జరిగితే ఆర్సీబీ కప్ కొట్టడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. గత మూడేళ్లుగా లక్నో సూపర్ జెయింట్స్‌కు సారథిగా ఉన్న కేఎల్ రాహుల్ వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందు ఆ జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. గత ఐపీఎల్ సీజన్ చివర్లో కేఎల్ రాహుల్, లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా మధ్య వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఒక ఫ్రాంచైజీ ఓనర్ అలా జట్టు కెప్టెన్ ని పట్టుకుని తిట్టడంపై నెట్టింట దుమారం రేగింది. తర్వాత దాన్ని చల్లార్చడానికి సంజీవ్ గోయెంకా ఒక పార్టీ ఇచ్చి, దానికి కేఎల్ రాహుల్ ని గెస్ట్ గా పిలిచి, సారీ చెప్పి సముదాయించాడు. అయితే అక్కడితో కథ ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ విరిగిన మనసులు మళ్లీ అతకవు అనే నానుడి నిజమయ్యేలాగే ఉంది.
జట్టును వీడాలని రాహుల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అతడి కోసం ఆర్సీబీ కూడా ఆసక్తి చూపిస్తోంది. దీంతో రాహుల్ మళ్లీ ఆర్సీబీలోకి చేరి సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వాస్తవానికి కేఎల్ రాహుల్ .ఆర్‌సీబీతోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 2013 నుంచి 2016 వరకు ఆర్‌సీబీ తరఫున ఆడాడు. గాయం కారణంగా 2017 సీజన్‌కు దూరంగా ఉన్న అతను 2018 మెగా వేలానికి ముందు పంజాబ్ జట్టుకు మారిపోయాడు. నాలుగేళ్ల పాటు పంజాబ్ కింగ్స్‌కు ఆడిన అతను ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు మారాడు. తాజాగా మళ్లీ ఆర్‌సీబీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు రాహుల్. మరి రాహుల్ కోహ్లీ కలిస్తే జట్టు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కామెంట్ చేయండి.
Also Read: Kaithi 2 : ఖైదీ 2లోనే రోలెక్స్ వరల్డ్‌ని రివీల్ చేస్తాను.. లోకేష్ కనగరాజ్