Jay Shah: 35 వయస్సులో ఐసీసీ రేసులో జైషా
బీసీసీఐ సెక్రటరీ జైశా వయస్సు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. ఐసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడేవారిలో బీసీసీఐ కార్యదర్శి జయ్ షా అగ్రస్థానంలో ఉన్నాడు. జైశా ఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైతే క్రికెట్ చరిత్రలో ఇదొక సంచలనంగా మారుతుంది.
- By Praveen Aluthuru Published Date - 03:53 PM, Wed - 10 July 24

Jay Shah: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వార్షిక సదస్సు ఈ నెలలో కొలంబోలో జరగాల్సి ఉంది. నవంబర్‌లో కొత్త ఐసీసీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఐసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడేవారిలో ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జయ్ షా అగ్రస్థానంలో ఉన్నాడు. జైశా ఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైతే క్రికెట్ చరిత్రలో ఇదొక సంచలనంగా మారుతుంది.
జైశా వయస్సు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. న్యూజిలాండ్‌కు చెందిన ప్రస్తుత ఐసిసి ప్రెసిడెంట్ గ్రెగ్ బార్క్లే తన నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయనున్నారు. అతనికి బీసీసీఐ సెక్రటరీ జయ్ షా మద్దతు ఉంది. అతను కోరుకుంటే తదుపరిసారి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అయితే జయ్ షా స్వయంగా ఎన్నికల్లో పోటీ చేస్తే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం దాదాపు ఖాయం.
ఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఐసిసి ఇటీవల నిబంధనలను మార్చింది. దీని ప్రకారం రెండేళ్ళకు మూడు పర్యాయాలు కాకుండా మూడు సంవత్సరాలకు రెండు పర్యాయాలు పదవీ విరమణ చేయవచ్చు. ఈ విధంగా షా తన మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తే, బీసీసీఐ నిబంధనల ప్రకారం 2028లో మళ్ళీ బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగవచ్చు. ఐసిసి వార్షిక సమావేశం జులై 19-22 మధ్య కొలంబోలో జరగనుంది. ఈ వార్షిక సదస్సులో ఛైర్మన్ ఎన్నికకు సంబంధించిన టైమ్‌లైన్‌ను అధికారికంగా రూపొందించనున్నారు. మరోవైపు ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానా లేదా అనే దానిపై షా ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో వివాదాల తర్వాత ఐసీసీ ప్రక్షాళనకు సిద్దమవుతోంది. కాగా గతంలో భారత్ నుంచి జగ్ మోహన్ దాల్మియా, శరద్ పవార్ వంటి వారు ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టారు.
Also Read: Phone Tapping Case : వ్యక్తిగత జీవితాలపై రాద్ధాంతం చేయొద్దు.. మీడియాకు హైకోర్టు ఆదేశాలు