India vs England: సిరీస్ కోల్పోయినా బాధ లేదు.. మా వాళ్ళు అద్భుతంగా ఆడారు
12 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న ఇంగ్లండ్, కెప్టెన్ బెన్‌స్టోక్స్ కల కేవలం కలగానే మిగిలిపోయింది. రోహిత్ సేన రాంచీలో 5 వికెట్ల తేడాతో బ్రిటిష్‌ను ఓడించి సిరీస్‌లో తిరుగులేని 3-1 ఆధిక్యాన్ని సాధించింది.
- Author : Praveen Aluthuru
Date : 26-02-2024 - 5:16 IST
Published By : Hashtagu Telugu Desk
India vs England: 12 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ కల కేవలం కలగానే మిగిలిపోయింది. రోహిత్ సేన రాంచీలో 5 వికెట్ల తేడాతో బ్రిటిష్‌ను ఓడించి సిరీస్‌లో తిరుగులేని 3-1 ఆధిక్యాన్ని సాధించింది. అయితే సిరీస్ కోల్పోయినందుకు కెప్టెన్ బెన్ స్టోక్స్ కొంచెం కూడా పశ్చాత్తాపం చెందడం లేదు. స్టోక్స్ తన జట్టు ప్రదర్శన పట్ల గర్వపడ్డాడు.
నాలుగో టెస్టులో ఓటమి తర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. ఇది గొప్ప టెస్ట్ మ్యాచ్ అని నేను భావిస్తున్నాను. ఈ టెస్ట్‌లో చూడాల్సింది చాలా ఉంది. మ్యాచ్ తీరు ప్రతిరోజూ మారిపోయింది. నేను నా జట్టు గురించి మాత్రమే గర్వపడగలను. మా జట్టులో కొంతమంది అనుభవం లేని స్పిన్నర్లు ఉన్నారు. కానీ వారి ప్రదర్శన పట్ల నేను గర్వపడుతున్నాను. భారత్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆడటానికి యువ ఆటగాళ్లకు అవకాశం మరియు స్వేచ్ఛ ఇవ్వడం నా కెప్టెన్సీలో భాగం. నేను టెస్ట్ క్రికెట్‌కు పెద్ద అభిమానిని, రెండు జట్ల యువ ఆటగాళ్లు ఆడిన విధానం బాగుంది. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుంది. స్పిన్నర్లను ఎదిరించి బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. పిచ్ బాగోదని మాకు తెలుసని చెప్పాడు.
షోయబ్ బషీర్‌ను బెన్ స్టోక్స్ ప్రశంసించాడు. జో రూట్‌ను విమర్శించడం సరికాదని భావిస్తున్నాను. అతను చాలా సీనియర్. 12 వేల టెస్ట్ పరుగులు చేశాడు. అతను గొప్ప ఆటగాడు. బషీర్ ప్రయాణం అద్భుతమైనది. అతడు చాలా తక్కువ మ్యాచులు ఆడినప్పటికీ భారత్‌పై ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో సహా 8 వికెట్లు తీయడం అద్భుతం. మొత్తంగా మేము ఈ సీరీస్లో చాలా బాగా పోరాడాము అని స్టోక్స్ చెప్పడం ఆసక్తి దాయకం.
Also Read: TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. రమణ దీక్షితులుపై వేటు