Shreyas Iyer: ముంబై ఇండియన్స్‌లోకి అయ్యర్.. ఆకాశ్ అంబానీ డీల్‌కు ఓకే అన్నాడా?
ఆకాశ్ అంబానీ ముంబై ఇండియన్స్ యజమాని ముకేశ్ అంబానీ కుమారుడు. అతను దాదాపు ప్రతి మ్యాచ్‌లో జట్టుకు మద్దతు ఇవ్వడానికి మైదానానికి వస్తాడు. పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ సమయంలో కూడా అతను జైపూర్‌లో ఉన్నాడు.
- By Gopichand Published Date - 09:25 AM, Wed - 28 May 25

Shreyas Iyer: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) లక్నోను ఓడించి పాయింట్స్ టేబుల్‌లో టాప్ 2 స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు క్వాలిఫయర్ 1లో ఆ జట్టు పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ లీగ్ దశను పాయింట్స్ టేబుల్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచి పూర్తి చేసింది. వారు ముంబై ఇండియన్స్‌ను ఓడించి టాప్ 2లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఆకాశ్ అంబానీ.. శ్రేయాస్ అయ్యర్‌తో సంభాషిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఆకాశ్ అంబానీ ముంబై ఇండియన్స్ యజమాని ముకేశ్ అంబానీ కుమారుడు. అతను దాదాపు ప్రతి మ్యాచ్‌లో జట్టుకు మద్దతు ఇవ్వడానికి మైదానానికి వస్తాడు. పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ సమయంలో కూడా అతను జైపూర్‌లో ఉన్నాడు. అతను బౌండరీ లైన్ వద్ద కూర్చున్నాడు. ఈ సమయంలో శ్రేయాస్ అయ్యర్ ఆ వైపు ఫీల్డింగ్ చేయడానికి వెళ్లినప్పుడు ఆకాశ్ అతనితో ఏదో మాట్లాడాడు. అయ్యర్ కూడా బౌండరీ దాటి అతనితో సంభాషించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోన్నాయి. అయితే అయ్యర్‌ను తర్వాతి సీజన్‌కు ముంబైలో ఆడమని ఆకాశ్ కోరినట్లు తెలుస్తోంది. దీనికి శ్రేయస్ అయ్యర్ ఆ కోరికను సున్నితంగా తిరస్కరించాడని జాతీయ మీడియా కథనాల్లో వార్తలు వస్తున్నాయి. దీనిపై అయ్యర్ లేదా ఆకాశ్ అంబానీ ఇంతవరకు స్పందించలేదు.
Also Read: IPL 2025 Playoffs: ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ పూర్తి షెడ్యూల్ ఇదే.. రెండు మ్యాచ్‌లు ఏ జట్టుకు అంటే!
It seems Shreyas Iyer wasn't convinced with the deal Ambani offered…! pic.twitter.com/4JW2OA9pBZ
— Dinda Academy (@academy_dinda) May 26, 2025
పంజాబ్ కింగ్స్ విజయంతో క్వాలిఫయర్ 1లో స్థానం ఖరారు
జైపూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 57 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే పంజాబ్ బ్యాటర్లు ప్రభావవంతంగా ఆడారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జోష్ ఇంగ్లిస్ (73), ప్రియాంశ్ ఆర్య (62) శక్తివంతమైన ఆరంభాన్ని అందించారు. శ్రేయాస్ అయ్యర్ విన్నింగ్ షాట్ కొట్టాడు. పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌ను గెలిచి టాప్ 1లో నిలిచింది.
ఇప్పుడు పంజాబ్ కింగ్స్ క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఆర్సీబీ లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో లక్నోను ఓడించింది. పంజాబ్- బెంగళూరు రెండూ 19 పాయింట్లతో ఉన్నాయి. కానీ నెట్ రన్ రేట్ ఆధారంగా పంజాబ్ (+0.372).. RCB (+0.301) కంటే మెరుగ్గా ఉంది. క్వాలిఫయర్ 1 ముల్లంపూర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. గుజరాత్‌కు 18 పాయింట్లు, ముంబైకి 16 పాయింట్లు ఉన్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్ మే 30న ముల్లంపూర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.