Rohit Sharma: ముంబై తరుపున రోహిత్ ఆడబోయే చివరి మ్యాచ్ ఇదేనా..?
ఐపీఎల్ లో ఈ రోజు జరిగే మ్యాచ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ లక్నో జట్లు తలపడనున్నాయి. అయితే రోహిత్ శర్మ ముంబై తరుపున ఇదే చివరి మ్యాచ్ అని అంటున్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్లో రోహిత్ ను మరో జట్టులో చూడొచ్చని కొందరు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
- By Praveen Aluthuru Published Date - 05:11 PM, Fri - 17 May 24

Rohit Sharma: ఐపీఎల్ లో ఈ రోజు జరిగే మ్యాచ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ లక్నో జట్లు తలపడనున్నాయి. అయితే రోహిత్ శర్మ ముంబై తరుపున ఇదే చివరి మ్యాచ్ అని అంటున్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్లో రోహిత్ ను మరో జట్టులో చూడొచ్చని కొందరు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వాదనలో నిజం ఉందని అనుకోవచ్చు.
ఐదు సార్లు జట్టుని విజేతగా నిలిపిన రోహిత్ ను కాదని, ముంబైకి హార్దిక్ పాండ్యని కెప్టెన్ గా చేయడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేపోతున్నారు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ నుంచే పాండ్యను టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోల్స్ చేశారు. ఇక ముంబైను వీడి మా జట్టులోకి వచ్చేయ్ అన్న అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెట్టడం ఆసక్తిదాయకం. ఏదేమైనా ఈ రోజు రోహిత్ ముంబై తరుపున చివరి మ్యాచ్ ఆడబోతున్నాడంటూ ఎక్స్ లో వరుస పోస్టులతో ఫాన్స్ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే సీజన్‌లో రోహిత్ కోల్‌కతాకు వెళ్లే అవకాశం ఉందనే వార్తల మధ్య, ముంబైకి ఈ గేమ్ హాట్ టాపిక్‌గా మారింది.
ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ నుండి నిష్క్రమించింది. మరోవైపు లక్నో జట్టు భారీ తేడాతో గెలిచి ప్లేఆఫ్ రేసులో స్థానం సంపాదించాలని భావిస్తుంది. ఈ పరిస్థితి లో ఇరు జట్ల మధ్య ఈ రోజు జరిగే పోరు అభిమానుల్ని కచ్చితంగా కనువిందు చేస్తుందని చెప్పొచ్చు.పాయింట్ల పట్టికలో ఇరు జట్ల స్థానాలను పరిశీలిస్తే ముంబై 13 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, 9 ఓటములతో ఎనిమిది పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. లక్నో జట్టు 13 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, ఏడు ఓటములతో 12 పాయింట్లను దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మొత్తం 5 మ్యాచ్‌లు జరగగా, అందులో 4 మ్యాచ్‌లు లక్నో గెలవగా, 1 మ్యాచ్‌లో ముంబై గెలిచింది. ఈ సీజన్‌లో 48వ మ్యాచ్‌లో ముంబై, లక్నో జట్లు తలపడ్డాయి. అప్పుడు లక్నో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంటే లక్నోదే పైచేయి కనిపిస్తుంది.
వాంఖడే భారతదేశంలోని చారిత్రక మైదానాలలో ఒకటి. ఇక్కడ పిచ్ మాత్రం బ్యాటర్లకు స్వర్గధామంగా పరిగణించబడుతుంది. చిన్న మైదానం కావడంతో వాంఖడే స్టేడియంలో ఫోర్లు, సిక్సర్లు చూడొచ్చు. అధిక స్కోరింగ్ మ్యాచ్‌లు ఇక్కడ తరచుగా కనిపిస్తాయి. దీంతో పాటు ముంబై పిచ్‌పై స్పిన్నర్లకు కూడా కొంత సాయం అందుతుంది. సరైన లైన్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే స్పిన్నర్లు ఇక్కడ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టవచ్చు. వాంఖడే స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 115 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 53 మ్యాచ్‌లు గెలవగా, 62 మ్యాచ్‌లు ఛేజింగ్‌లో గెలిచింది. మంచు ప్రభావం ఉండటంతో ఛేజింగ్ జట్టు ఎక్కువ ప్రయోజనం పొందుతుంది. ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్టు 60 మ్యాచ్‌లు గెలిచింది.
Also Read: Kannappa : కన్నప్ప మూవీలోకి మరో స్టార్ ఎంట్రీ.. ఈసారి అందాల భామ..