Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄Ipl Rajasthan Royals Vs Chennai Super Kings Sanju Samson Co Target 2nd Spot

RR vs CSK: సెకండ్ ప్లేస్ టార్గెట్ గా రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2022 సీజన్ లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.

  • By Naresh Kumar Updated On - 05:42 PM, Fri - 20 May 22
RR vs CSK: సెకండ్ ప్లేస్ టార్గెట్ గా రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2022 సీజన్ లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
ముంబై బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఫలితం నామమాత్రం కానుంది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఆర్ఆర్.. 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి దాదాపు ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. మెరుగైన నెట్‌రన్ రేట్‌తో రెండోస్థానానికి చేరుకునే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు చెన్నై ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండోస్థానంలో ఉంది. ఈ గేమ్‌లో విజయం సాధించి.. గౌరవప్రదంగా ఈ సీజన్‌ను ముగించాలని చూస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైన చెన్నై.. ఈ మ్యాచ్‌లోనూ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది.
రాజస్థాన్ విషయానికి వస్తే.. స్టార్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ ఈ సీజన్‌లో దుమ్ములేపుతున్నాడు. 627 రన్స్‌తో ఆరెంజ్ క్యాప్‌ రేస్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అతనికి తోడు యశస్వి జైస్వాల్, దేవ్‌దూత్ పడిక్కల్ కూడా అద్భుత ఫామ్‌లో ఉండడం రాజస్థాన్‌కు కలిసి వస్తోంది. హిట్‌మేయర్ స్వదేశానికి వెళ్లిపోవడంతో.. మిడిల్ ఆర్డర్‌కు మారిపోయిన కెప్టెన్ సంజూ శాంసన్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఆల్‌రౌండర్ జేమ్మీ నీషమ్ కూడా గత మ్యాచ్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. రియన్ పరాగ్ కూడా తన సత్తా ఏంటో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది.

గత మ్యాచ్‌లో కొత్త కుర్రాళ్లకు ఛాన్స్ ఇచ్చిన చెన్నై.. చివరి మ్యాచ్‌లో కూడా రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్ విభాగంలో చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఓపెనర్లు కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్‌ విభాగంలో దుమ్ములేపుతున్నారు. మొయిన్ అలీ అటు బ్యాటింగ్‌లో.. ఇటు బౌలింగ్‌లో టీమ్‌కు మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. గత మ్యాచ్‌లో అంబటి రాయుడ ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చిన నారాయణ్ జగదీశన్ 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోసారి అతనికి టీమ్‌లో ప్లేస్ దక్కే ఛాన్స్ ఉంది. ఒకటి రెండు మ్యాచ్‌లో మెరిసిన శివమ్ ధూబే మళ్లీ ఫామ్ కోల్పోయాడు. ధోనికి ఇదే చివరి సీజన్‌ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఐపీఎల్‌లో అతనికి ఇదే చివరి మ్యాచ్‌ అవుతుంది. ఒకవేళ అదే నిజమైతే.. ధోని తన చివరి మ్యాచ్‌ను ఘనంగా ముగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags  

  • Chennai Super Kings
  • CSK vs RR
  • IPL 2022
  • rajasthan royals

Related News

Mohammed Shami: షమీ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా ?

Mohammed Shami: షమీ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా ?

టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టీమిండియా కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది.

  • Sanju Samson: సంజూ శాంసన్ కు నిలకడ లేదు

    Sanju Samson: సంజూ శాంసన్ కు నిలకడ లేదు

  • HARDIK PANDYA : టీ ట్వంటీ ప్రపంచకప్ నా టార్గెట్ : పాండ్యా

    HARDIK PANDYA : టీ ట్వంటీ ప్రపంచకప్ నా టార్గెట్ : పాండ్యా

  • Gautam Gambhir: నా ఇంట్లో డబ్బులు కాసే చెట్టు లేదు

    Gautam Gambhir: నా ఇంట్లో డబ్బులు కాసే చెట్టు లేదు

  • Hanuma Vihari: విహారి సెంచరీలు చేయకుంటే చోటు కష్టమే

    Hanuma Vihari: విహారి సెంచరీలు చేయకుంటే చోటు కష్టమే

Latest News

  • Bakrid : బక్రీద్ సందర్భంగా అధికారుల‌తో హైద‌రాబాద్ సీపీ రివ్యూ మీటింగ్‌

  • Cyber Fraud : సైబర్ మోసంలో రూ.39 లక్ష‌లు పోగొట్టుకున్న హైదరాబాద్ యువతి

  • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

  • Team England: టెస్ట్ క్రికెట్ కు సరికొత్త ఊపు తెచ్చిన ఇంగ్లాండ్

  • Team India: WTC పాయింట్ల పట్టికలో దిగజారిన భారత్

Trending

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

    • Viral Video: పిల్లి తింగరి చేష్టలు.. ఓనర్ రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో!

    • On Camera: వాస్తు నిపుణుడు దారుణ హత్య.. సీపీ పుటేజీలో నిక్షిప్తమైన వీడియో!

    • Google’s July 4 Animation: గూగుల్ ను తిడుతున్న నెటిజన్స్.. కారణం ఏమిటంటే?

    • Taliban Commander : మిలిటరీ ఛాపర్‌లో నవ వధువును ఇంటికి తీసుకెళ్లిన తాలిబ‌న్ క‌మాండ‌ర్‌

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: