SRH vs LSG: హోం గ్రౌండ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. లక్నో ఘన విజయం!
సన్‌రైజర్స్ హైదరాబాద్ హోం గ్రౌండ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (SRH vs LSG) గొప్ప విజయాన్ని సాధించింది. ఈ ఆధిపత్య మ్యాచ్‌లో లక్నో SRHని 5 వికెట్ల తేడాతో ఓడించింది.
- By Gopichand Published Date - 12:15 AM, Fri - 28 March 25

SRH vs LSG: సన్‌రైజర్స్ హైదరాబాద్ హోం గ్రౌండ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (SRH vs LSG) గొప్ప విజయాన్ని సాధించింది. ఈ ఆధిపత్య మ్యాచ్‌లో లక్నో SRHని 5 వికెట్ల తేడాతో ఓడించింది. హైదరాబాద్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని లక్నో కేవలం 5 వికెట్లు కోల్పోయి సాధించింది. లక్నో తరపున నికోలస్ పూరన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 70 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో మిచెల్ మార్ష్ 52 పరుగులతో సహకరించాడు. బౌలింగ్‌లో షార్దుల్ ఠాకూర్ విజృంభించి నాలుగు వికెట్లు పడగొట్టాడు. IPL 2025లో లక్నోకు ఇది తొలి విజయం. అయితే హైదరాబాద్ తొలి ఓటమిని చవిచూసింది.
హైదరాబాద్‌లో పూరన్ షో
191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో సూపర్ జయంట్స్ ఆరంభం సరిగా లేకపోయింది. మార్కరమ్ కేవలం 1 పరుగుతో ఔటయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ లక్నోను గెలిపించే బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్ బౌలర్లను ఆడుకున్నారు. రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. పూరన్ కేవలం 26 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 269 స్ట్రైక్ రేట్‌తో 6 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. పూరన్ ఔటైన తర్వాత మిచెల్ మార్ష్ తన అద్భుత బ్యాటింగ్ కొనసాగించి 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 15 పరుగులు చేసి ఔటయ్యాడు. డేవిడ్ మిల్లర్ 13, అబ్దుల్ సమద్ 8 బంతుల్లో 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయం వైపు నడిపించారు.
Also Read: Kaman Bridge Vs Tragedy : లవర్స్ డెడ్‌బాడీలు.. బార్డర్‌లో తెరుచుకున్న వంతెన.. ఏమైంది ?
షార్దుల్ ఠాకూర్ విజృంభణ
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరంభం సరిగా లేదు. షార్దుల్ ఠాకూర్ వరుసగా రెండు బంతుల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత నితీష్ రెడ్డి, హెడ్ కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను కాపాడారు. అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. హెడ్‌ను ప్రిన్స్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేసి ఔట్ చేశాడు. అదే సమయంలో నితీష్ రెడ్డి ఇన్నింగ్స్‌ను రవి బిష్ణోయ్ ముగించాడు. హెన్రిచ్ క్లాసెన్ 17 బంతుల్లో 26 పరుగులు చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. చివరి ఓవర్లలో అనికేత్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 13 బంతుల్లో 36 పరుగులు చేశాడు. దీంతో SRH 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు సాధించింది. లక్నో బౌలింగ్‌లో శార్దుల్ ఠాకూర్ 34 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా శార్దుల్ ఠాకూర్ ఎంపికయ్యాడు.