IPL 2025: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. భువీ వస్తున్నాడు..
చెన్నైతో మ్యాచ్‌కు ముందు బెంగలూరు జట్టుకు అదిరిపోయే శుభవార్త అందింది. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు గాయంతో దూరంగా ఉన్న టీమిండియా సీనియర్ పేసర్ స్వింగ్ స్టార్ భువనేశ్వర్ కుమార్.. ఇప్పుడు కోలుకున్నట్లు తెలుస్తోంది.
- By Kode Mohan Sai Published Date - 06:08 PM, Tue - 25 March 25

ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ మరియు ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగుళూరు కేకేఆర్‌ను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో ప్రస్తుతం జోరు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు టోర్నీలో రెండో మ్యాచ్ కు సిద్దమవుతోంది. బెంగళూరు తమ రెండో మ్యాచ్‌లో భాగంగా చిందబరం స్టేడియం వేదికగా మార్చి 28న చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీపడనుంది. అటు చెన్నై జట్టు కూడా తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించి మంచి ఉత్సాహంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది.
Qatar Airways Postcard 🎴✈️
Camp’s got the vibe, and we’re keepin’ it buzzing! 🔥🤩#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 @qatarairways pic.twitter.com/U9tT4Us2VN
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 25, 2025
చెన్నైతో మ్యాచ్‌కు ముందు బెంగలూరు జట్టుకు అదిరిపోయే శుభవార్త అందింది. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు గాయంతో దూరంగా ఉన్న టీమిండియా సీనియర్ పేసర్ స్వింగ్ స్టార్ భువనేశ్వర్ కుమార్.. ఇప్పుడు కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు అతడు బౌలింగ్ ప్రాక్టీస్‌ను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్సీబి యాజమాన్యం తాజాగా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. భువనేశ్వర్ వికెట్లు తీసేందుకు సిద్ధమయ్యాడు. త్వరలొనే అతడి స్వింగ్ ను సీబుడబోతున్నాం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఆర్సీబీ తదుపరి మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ లో భువనేశ్వర్ కుమార్‌కు అద్భుతమైన రికార్డు ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 176 ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ 35 ఏళ్ల పేసర్ మొత్తంగా 181 వికెట్లు పడగొట్టాడు. ఇక కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తరఫున నిలకడగా రాణిస్తున్న భువనేశ్వర్ కుమార్ ను మెగా వేలంలో రూ. 10.75 భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే..