HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ipl 2023 Not 74 Days Ipl 2023 To Be 60 Day Affair As Wtc Finals Forces Bcci To Put Longer Ipl On Hold

IPL 2023: వచ్చే ఐపీఎల్ 60 రోజులే.. కారణం అదే

ఐపీఎల్ 16వ సీజన్ కు బీసీసీఐ సన్నాహాలు మొదలయ్యాయి. ఇటీవలే మినీ వేలం ముగియగా.. ఫ్రాంచైజీలు తమ జట్ల కూర్పులో బిజీగా ఉన్నాయి.

  • By Naresh Kumar Published Date - 03:35 PM, Sun - 25 December 22
  • daily-hunt
Image 1669980511
Image 1669980511

ఐపీఎల్ 16వ సీజన్ కు బీసీసీఐ సన్నాహాలు మొదలయ్యాయి. ఇటీవలే మినీ వేలం ముగియగా.. ఫ్రాంచైజీలు తమ జట్ల కూర్పులో బిజీగా ఉన్నాయి. గత సీజన్ లో 10 జట్లు చేరడంతో లీగ్ స్థాయి పెరిగింది. రెండు కొత్త జట్ల ఎంట్రీ మ్యాచ్ ల సంఖ్య కూడా పెరగడం సహజమే. దీంతో వచ్చే ఏడాది నుంచి రోజుల సంఖ్య కూడా పెరగనుందని బీసీసీఐ ముందే చెప్పింది. దాదాపు 74 రోజుల పాటు లీగ్ జరిగే అవకాశమున్నట్టు అంచనా వేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం వచ్చ ఐపీఎల్ సీజన్ కూడా 60 రోజుల్లోనే ముగించాల్సి రావొచ్చు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఉండడమే దీనికి కారణం. ఐసీసీ నిబంధనల ప్రకారం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వారం రోజుల ముందే ఏ టోర్నీ లేదా ద్వైపాక్షిక సిరీస్ లు ముగిసిపోవాలి.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ 16వ సీజన్ 74 రోజులు జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ కు కేవలం 3 లేదా 4 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. అందుకే 60 రోజుల్లోనే ఇప్పుడు బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్ రూపొందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్ ఖరారు కానప్పటకీ… బోర్డు వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 1న ఆరంభమై.. మే 31న ముగిసే అవకాశముంది. బీసీసీఐ కొత్తగా ఆరంభించనున్న మహిళల ఐపీఎల్ కూడా పురుషుల ఐపీఎల్ షెడ్యూల్ పై ప్రభావం చూపించింది. మహిళల ఐపీఎల్ ను మార్చిలోనే నిర్వహించాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూల్ 7 నుంచి 11 వరకూ జరిగే అవకాశముండగా..దీని ప్రకారం ఐపీఎల్ సీజన్ మే 31 లోపే ముగిసిపోవాలి. దీంతో ఈ సారి 74 రోజుల విండో కష్టమేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఏడాదిలో ఐపీఎల్ షెడ్యూల్ పై పూర్తి క్లారిటీ రానుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • IPL 2023
  • IPL season
  • WTC

Related News

IND vs SA

IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు!

దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుని భారత పర్యటనకు వస్తోంది. మరోవైపు భారత జట్టు WTC 2025-27 సైకిల్‌లో తమ మొదటి సిరీస్‌ను ఇంగ్లాండ్‌తో ఆడింది.

  • Sanju Samson

    Sanju Samson: సంజూ శాంసన్ బ్యాటింగ్‌తో ఎందుకు ఆడుకుంటున్నారు?

  • T20 World Cup 2026

    T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026.. భారత్‌లోని ఈ 5 నగరాల్లోనే మ్యాచ్‌లు!

  • Team India Squad

    Team India Squad: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌.. త్వ‌ర‌లోనే టీమిండియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌?!

  • Sunrisers Hyderabad

    Sunrisers Hyderabad: ఐపీఎల్‌ 2026 వేలానికి ముందు స‌న్‌రైజ‌ర్స్‌ నుండి స్టార్ బ్యాట‌ర్‌ విడుదల?

Latest News

  • Ande Sri: అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు – సీఎం రేవంత్

  • Miracle in the Mulugu Forest: ములుగు అడవుల్లో అద్భుతం

  • Hyderabad : హైదరాబాద్ అడ్డాగా ఉగ్రకుట్రకు ప్లాన్

  • Kavitha : బీఆర్ఎస్‌తో బంధం తెగిపోయింది – కవిత

  • Ande Sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి

Trending News

    • Akash Choudhary: విధ్వంసం.. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ!

    • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

    • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd