Kolkata Knight Riders: కోల్ కత్తా జట్టులోకి ఆరోన్ ఫించ్
ఐపీఎల్ 2022 మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్, ఆర్సీబీ మాజీ ఆటగాడు ఆరోన్ ఫించ్ కు అదృష్టం
- Author : Naresh Kumar
Date : 12-03-2022 - 10:29 IST
Published By : Hashtagu Telugu Desk
ఐపీఎల్ 2022 మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్, ఆర్సీబీ మాజీ ఆటగాడు ఆరోన్ ఫించ్ కు అదృష్టం ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ రూపంలో తలుపుతట్టింది. ఇటీవల ముగిసిన వేలంలో హేల్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ రూ.1.5 కోట్ల కనీస ధరకు సొంతం చేసుకోగా.. బయోబబుల్ కారణాల చేత అతను ఈ ఏడాది లీగ్‌కు అందుబాటులో ఉండనని సీజన్ ఆరంభానికి ముందే ప్రకటించాడు. అయితే టోర్నీకి దూరమైన అలెక్స్ హెల్స్ స్థానంలో 35 ఏళ్ల ఆరోన్ ఫించ్‌ను కేకేఆర్ ఫ్రాంచైజీ రూ. 1.5 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఇక ఆరోన్ ఫించ్ తన ఐపీఎల్ కెరీర్లో మొత్తం 87 మ్యాచ్‌లు ఆడి 2005 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్థ శతకాలు ఉన్నాయి..
ఇక మార్చి 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2022వ సీజన్ మొదలు కానుండగా ఈసారి ట్రోఫీ గెలువడమే లక్ష్యంగా కేకేఆర్ జట్టు బరిలోకి దిగనుంది.. ఇందుకు అనుగుణంగానే ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ అసలు సిసలైన జట్టును కొనుగోలు చేసింది.. వీరిలో శ్రేయస్ అయ్యర్, పాట్ కమిన్స్, నితీశ్ రాణా, శివమ్ మావి ఉన్నారు.. ఇక మెగా వేలానికి ముందే , ఆండ్రీ రసెల్ , వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్, సునీల్ నరైన్ లను రీటైన్ చేసుకున్న కేకేఆర్.. మెగా వేలంలో 45 కోట్లు వెచ్చించి 19 మంది ఆటగాళ్లను దక్కించుకుంది.