Umpire Bismillah: క్రికెట్ ప్రపంచంలో విషాదం.. 41 ఏళ్లకే అంపైర్ కన్నుమూత!
ICC చైర్మన్ జయ్ షా కూడా షిన్వారీ మరణంపై విచారం వ్యక్తం చేస్తూ, ఆయన క్రికెట్‌కు చాలా సహకారం అందించారని, ఆయన మరణించడం క్రికెట్ సమాజానికి పెద్ద నష్టమని, మేము ఆయన కుటుంబం, సన్నిహితులకు సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు.
- By Gopichand Published Date - 05:15 PM, Tue - 8 July 25

Umpire Bismillah: అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ బిస్మిల్లా జాన్ షిన్వారీ (Umpire Bismillah) కేవలం 41 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు మంగళవారం ఈ విషయాన్ని ధృవీకరించింది. ఆయన మరణ వార్త తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. షిన్వారీ ICC అంతర్జాతీయ అంపైర్ల ప్యానెల్ సభ్యుడిగా ఉన్నారు. 25 వన్డే, 21 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అంపైరింగ్ చేశారు. డిసెంబర్ 2017లో ఆఫ్ఘనిస్తాన్ -ఐర్లాండ్ మధ్య షార్జాలో జరిగిన వన్డే మ్యాచ్‌తో ఆయన తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించారు.
Also Read: CM Chandrababu : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ACB's Condolence and Sympathy Message
ACB’s leadership, staff, and entire AfghanAtalan family are deeply shocked and saddened by the demise of Bismillah Jan Shinwari (1984 – 2025), a respected member of Afghanistan’s elite umpiring panel.
It is with deep sorrow that we share… pic.twitter.com/BiZrTOLe6m
— Afghanistan Cricket Board (@ACBofficials) July 7, 2025
వన్డే క్రికెట్‌లో ఆయన ఈ సంవత్సరం ఫిబ్రవరి 18న ఒమన్ వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్‌లో అంపైరింగ్ చేశారు. అదే విధంగా T20 అంతర్జాతీయ మ్యాచ్‌గా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్ షార్జాలో మార్చి 18న జరిగిన మ్యాచ్ ఆయన చివరి అంపైరింగ్ మ్యాచ్‌గా నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) మంగళవారం ఆయనకు నివాళులు అర్పించింది. ACB తమ పోస్ట్‌లో ఇలా రాసింది. ACB నాయకత్వం, సిబ్బంది. మొత్తం ఆఫ్ఘన్ జట్టు బిస్మిల్లా జాన్ షిన్వారీ మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన ఆఫ్ఘనిస్తాన్ ఎలైట్ అంపైరింగ్ ప్యానెల్‌లో గౌరవనీయ సభ్యుడిగా ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఆయన మరణించారు. బిస్మిల్లా జాన్ ఆఫ్ఘన్ క్రికెట్‌కు నిజమైన సేవకుడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆయన కుటుంబం, స్నేహితులు, మొత్తం ఆఫ్ఘన్ క్రికెట్ సమాజానికి తన లోతైన సానుభూతిని తెలియజేస్తుందని పేర్కొంది.
ICC చైర్మన్ జయ్ షా కూడా షిన్వారీ మరణంపై విచారం వ్యక్తం చేస్తూ, ఆయన క్రికెట్‌కు చాలా సహకారం అందించారని, ఆయన మరణించడం క్రికెట్ సమాజానికి పెద్ద నష్టమని, మేము ఆయన కుటుంబం, సన్నిహితులకు సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు.