India vs Pakistan: ప్రపంచకప్‌లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్ కు కొత్త తేదీ ఫిక్స్.. కారణమిదే..!?
2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) మధ్య మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న జరగనుంది. అయితే ఈ మ్యాచ్ తేదీ మారనుంది.
- By Gopichand Published Date - 06:49 AM, Tue - 1 August 23

India vs Pakistan: 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) మధ్య మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న జరగనుంది. అయితే ఈ మ్యాచ్ తేదీ మారనుంది. ఓ నివేదిక ప్రకార.. నేడు ఇండో-పాక్ మ్యాచ్ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. అయితే, దీనికి ముందు ఇండో-పాక్ మ్యాచ్ తేదీ నివేదికలో ప్రస్తావనకు వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం.. 2023 ODI ప్రపంచ కప్‌లో ఇండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఇప్పుడు అక్టోబర్ 15కి బదులుగా అక్టోబర్ 14న జరగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు బిసిసిఐ లేదా ఐసిసి.. ఇండో-పాక్ మ్యాచ్ కొత్త తేదీని ప్రకటించలేదు. ప్రపంచ కప్ షెడ్యూల్‌లో మరిన్ని మార్పులు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మార్పులకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
భారత్-పాక్ మ్యాచ్ తేదీ మార్పుకి కారణమిదే..?
నివేదిక ప్రకారం.. నవరాత్రి అక్టోబర్ 15న వస్తుంది. ఈ కారణంగానే వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ తేదీ మారనుంది. ఇప్పుడు మ్యాచ్ అక్టోబర్ 15కి బదులుగా అక్టోబర్ 14న జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), BCCI గత నెలలో ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించాయి. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియంలో ఇండో- పాక్ మ్యాచ్‌ను నిర్వహించనుంది.
Also Read: WI vs IND: బాబర్ అజామ్ రికార్డును బద్దలు కొట్టిన గిల్
ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అక్టోబర్ 6, 12 తేదీల్లో హైదరాబాద్‌లో పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఒకరోజు ముందుగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగడం వల్ల బాబర్ అజామ్ జట్టుకు ప్రాక్టీస్‌కు ఒక రోజు తక్కువ సమయం లభిస్తుంది. ఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై, పూణే, బెంగళూరు, లక్నో, చెన్నై, కోల్‌కతాతో సహా భారతదేశంలోని 10 నగరాల్లో అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు 2023 ODI ప్రపంచ కప్ జరగనుంది.
భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ను చూసేందుకు అహ్మదాబాద్‌కు విమానాలు, హోటళ్ల బుకింగ్‌తో సహా ఇప్పటికే ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్న అభిమానులు, వాటాదారులలో ఈ షెడ్యూల్ మార్పు ప్రకటన ఆందోళన కలిగిస్తుంది. ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చూసే మ్యాచ్ లలో ఒకటి. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.