HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India U19 Vs Pakistan U19 Pakistan U19 Won By 191 Runs

బ్రేకింగ్‌.. భార‌త్‌పై పాక్ ఘ‌న‌విజ‌యం!

348 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ మ్హ‌త్రే కేవలం 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 26 పరుగులు చేసినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు.

  • Author : Gopi Date : 21-12-2025 - 6:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India vs Pakistan
India vs Pakistan

India vs Pakistan: అండర్-19 ఆసియా కప్ 2025 విజేతగా పాకిస్థాన్ నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పాక్ బౌలర్ల ముందు చేతులెత్తేశారు. 348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. ముందుగా భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోగా, ఆ తర్వాత బ్యాటర్లు కూడా ఘోరంగా విఫలమయ్యారు. అయితే ఈ ఓటమికి కెప్టెన్ ఆయుష్ మ్హత్రే తీసుకున్న ఒక నిర్ణయమే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

కెప్టెన్ ఆయుష్ మ్హత్రే చేసిన ఆ తప్పు ఏంటి?

ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ ఆయుష్ మ్హత్రే మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సాధారణంగా ఫైనల్ వంటి ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లలో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించాలని చూస్తుంది. కానీ ఆయుష్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత్ బౌలింగ్ ఎంచుకోవడంతో పాక్ కెప్టెన్ కూడా చాలా సంతోషంగా కనిపించాడు.

Also Read: 2026లో జరగబోయే 10 ప్రధాన క్రీడా టోర్నమెంట్లు ఇవే!

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఫలితంగా కేవలం 156 పరుగులకే టీమ్ ఇండియా ఆలౌట్ అయింది. జట్టులోని ఆరుగురు బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. భారత్ తరపున బౌలర్ దీపేష్ అత్యధికంగా 36 పరుగులు చేయడం గమనార్హం.

కుప్పకూలిన భారత బ్యాటింగ్ ఆర్డర్

348 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ మ్హ‌త్రే కేవలం 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 26 పరుగులు చేసినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారత్ 156 పరుగుల వద్దే చాపచుట్టేసింది. ఆయుష్ టాస్ గెలిచినప్పుడు మొదట బ్యాటింగ్ తీసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ayush Mhatre
  • ind vs pak
  • India U19 vs Pakistan U19
  • sports news
  • U19 Asia Cup 2025

Related News

Women's T20 World Cup: Pakistan routed by India again.

Womens T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్.. భారత్ చేతిలో మళ్లీ చిత్తైన పాకిస్థాన్..

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భారత జట్టు తమ జైత్రయాత్రను ఘనంగా ప్రారంభించింది. తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 64 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఓపెనర్ స్మృతి మంధాన (68) అద్భుత హాఫ్ సెంచరీతో రాణించగా, ఆల్ రౌండర్ దీప్తి శర్

    Latest News

    • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

    • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

    • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

    • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

    • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd