T20 World Cup 2023: టీ20 మహిళల ప్రపంచకప్ కోసం భారత జట్టు ప్రకటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
మహిళల టీ20 ప్రపంచకప్ (Women T20 World Cup) 2023 కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ప్రపంచకప్‌తో పాటు భారత్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే ముక్కోణపు సిరీస్‌కి భారత జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. T20 ప్రపంచకప్ ఫిబ్రవరి 10, 2023 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో టీమిండియా తన తొలి మ్యాచ్‌ని ఫిబ్రవరి 12, 2023న పాకిస్థాన్‌తో ఆడనుంది.
- Author : Gopichand
Date : 29-12-2022 - 8:40 IST
Published By : Hashtagu Telugu Desk
మహిళల టీ20 ప్రపంచకప్ (Women T20 World Cup) 2023 కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ప్రపంచకప్‌తో పాటు భారత్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే ముక్కోణపు సిరీస్‌కి భారత జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. T20 ప్రపంచకప్ ఫిబ్రవరి 10, 2023 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో టీమిండియా తన తొలి మ్యాచ్‌ని ఫిబ్రవరి 12, 2023న పాకిస్థాన్‌తో ఆడనుంది. అదే సమయంలో జనవరి 19 నుంచి ట్రై సిరీస్ ఆడాల్సి ఉంది. టీమ్ ఇండియా వరల్డ్ కప్ గ్రూప్-2లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత జట్టుతో పాటు ఇంగ్లండ్, వెస్టిండీస్, పాకిస్థాన్, ఐర్లాండ్ ఉన్నాయి. రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. అదే సమయంలో టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 26, 2023న కేప్ టౌన్‌లో జరుగుతుంది.
టీ20 వరల్డ్ కప్ 2023 కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ , అంజలి సర్వాణి, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే. రిజర్వ్‌లు: సబ్బినేని మేఘన, స్నేహ రాణా, మేఘనా సింగ్.
ప్రపంచకప్‌లో భారత జట్టు షెడ్యూల్ ఇదే
పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ – 12 ఫిబ్రవరి: కేప్ టౌన్.
వెస్టిండీస్‌తో రెండో మ్యాచ్ – ఫిబ్రవరి 15: కేప్ టౌన్.
ఇంగ్లాండ్‌తో మూడో మ్యాచ్ – 18 ఫిబ్రవరి: పోర్ట్ ఎలిజబెత్.
ఐర్లాండ్‌తో నాల్గవ మ్యాచ్ – 20 ఫిబ్రవరి: పోర్ట్ ఎలిజబెత్.
ముక్కోణపు సిరీస్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి శర్వాని, అంజలిష్మ వర్మ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, సబ్బినేని మేఘన, స్నేహ రాణా, శిఖా పాండే. ఇందులో పూజా వస్త్రాకర్ టీమ్‌లో చేరడం ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది.
ట్రై సిరీస్‌కి సంబంధించిన పూర్తి షెడ్యూల్
సిరీస్‌లో మొదటి మ్యాచ్ జనవరి 19 – దక్షిణాఫ్రికా v భారత్: బఫెలో పార్క్, ఈస్ట్ లండన్.
సిరీస్‌లో రెండవ మ్యాచ్ జనవరి 21 – దక్షిణాఫ్రికా v వెస్టిండీస్: బఫెలో పార్క్, ఈస్ట్ లండన్.
సిరీస్‌లో మూడో మ్యాచ్ జనవరి 23 – భారత్ vs వెస్టిండీస్: బఫెలో పార్క్, ఈస్ట్ లండన్.
సిరీస్‌లో నాలుగో మ్యాచ్ జనవరి 25 – దక్షిణాఫ్రికా v వెస్టిండీస్: బఫెలో పార్క్, ఈస్ట్ లండన్.
సిరీస్‌లో ఐదవ మ్యాచ్ జనవరి 28 – దక్షిణాఫ్రికా v భారత్: బఫెలో పార్క్, ఈస్ట్ లండన్.
సిరీస్ లో ఆరవ మ్యాచ్ జనవరి 30- వెస్టిండీస్ vs ఇండియా: బఫెలో పార్క్, ఈస్ట్ లండన్.
సిరీస్ చివరి మ్యాచ్ – ఫిబ్రవరి 2: బఫెలో పార్క్, ఈస్ట్ లండన్.