HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Look For Clean Sweep Against Bangladesh

IND vs BAN 2nd Test: క్లీన్​స్వీప్​​పై టీమిండియా కన్ను.. రేపే రెండో టెస్ట్ ప్రారంభం..!

మీర్‌పూర్‌ వేదికగా డిసెంబర్‌ 22 నుంచి బంగ్లాదేశ్‌ (IND vs BAN)తో ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌ కోసం టీమిండియా (IND vs BAN) సన్నద్ధమవుతోంది. 2 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్‌ నెగ్గి ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్‌.. రెండో టెస్ట్‌లోనూ గెలుపొంది ఆతిధ్య జట్టును క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది.

  • Author : Gopi Date : 21-12-2022 - 2:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India Vs Bangladesh Test
India Vs Bangladesh Test

మీర్‌పూర్‌ వేదికగా డిసెంబర్‌ 22 నుంచి బంగ్లాదేశ్‌ (IND vs BAN)తో ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌ కోసం టీమిండియా (IND vs BAN) సన్నద్ధమవుతోంది. 2 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్‌ నెగ్గి ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్‌.. రెండో టెస్ట్‌లోనూ గెలుపొంది ఆతిధ్య జట్టును క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరే అవకాశాలు మెరుగవ్వనున్న నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంది.

భారత్-బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య 2 మ్యాచ్‌ల సిరీస్‌లో రెండవ, చివరి టెస్ట్ మ్యాచ్ గురువారం నుండి మీర్పూర్‌లోని షేర్-ఇ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ సిరీస్‌లో ఆతిథ్య జట్టును క్లీన్‌స్వీప్‌ చేయాలని భారత్‌ కన్నేసిన వేళ బంగ్లాదేశ్‌ జట్టు మాత్రం ఎదురుదాడికి దిగాలని చూస్తోంది. ఈ టెస్టులో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరే అవకాశాన్ని టీమ్ ఇండియా పటిష్టం చేసుకోవచ్చు.

ఈ సిరీస్‌లోని మొదటి టెస్ట్ మ్యాచ్ చిట్టగాంగ్‌లో జరిగింది. ఇక్కడ ఐదో రోజు భారత జట్టు 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. టెస్ట్ మ్యాచ్ సందర్భంగా మిర్పూర్‌లో పగటి ఉష్ణోగ్రత 26 నుండి 27 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు. అక్యూవెదర్ ప్రకారం.. రెండో టెస్ట్ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం తక్కువ.

Also Read: SA20 league: టీ20 లీగ్ ప్రకటించిన సౌత్ ఆఫ్రికా

షేర్-ఇ బంగ్లా నేషనల్ స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలం. ఈ వికెట్‌పై ఫాస్ట్ బౌలర్లు ప్రారంభంలో సత్తా చూపవచ్చు. తర్వాత వికెట్ నెమ్మదిస్తుంది. రెండో రోజు తర్వాత ఈ వికెట్ స్పిన్నర్లకు సహకరిస్తుంది. అటువంటి పరిస్థితిలో నైపుణ్యం కలిగిన బ్యాట్స్‌మెన్ ఇక్కడ రాణించగలరు. ఈ పిచ్ పై వన్డేల్లో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 329 పరుగులు. మిర్పూర్ టెస్టు మ్యాచ్ లో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. బొటన వేలి గాయం కారణంగా రోహిత్ చిట్టగాంగ్ టెస్టులో కూడా ఆడలేకపోయాడు. ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ కూడా గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇటువంటి పరిస్థితిలో మీర్పూర్ టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ జోడి ఓపెనింగ్‌ చేసే ఛాన్స్ ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangladesh
  • Clean Sweep
  • IND vs BAN
  • IND vs BAN 2nd Test
  • KL Rahul
  • team india

Related News

Only by doing this will India reach the Women's T20 World Cup semi-finals... otherwise, it's back home!

Women’s T20 World Cup 2026: ఇలా చేస్తేనే మహిళల T20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్ కు ..లేదంటే ఇంటికే..!

మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భారత జట్టు విజయాల పరంపరకు బ్రేక్ పడింది. ఆదివారం జరిగిన హోరాహోరీ గ్రూప్-1 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన మారిజెన్ కాప్ (81 పరుగులు, 2/27) దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించి, ఆ జట్టు సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచింది. ప్రస్తుత టోర్నీలో భారత్‌కు ఇదే తొలి ఓటమి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ

    Latest News

    • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

    • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

    • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

    • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

    • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd