SA20 league: టీ20 లీగ్ ప్రకటించిన సౌత్ ఆఫ్రికా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు టీ20 లీగ్ లను ప్రకటించాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ వంటి దేశాలు టీ20 లీగ్ లను నిర్వహిస్తున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా బోర్డు సైతం టీ20 లీగ్ ను ప్రకటించింది. ఎస్ఏ టీ20 (SA20 league) పేరుతో నిర్వహించనున్న ఈ లీగ్ ప్రైజ్ మనీని తాజాగా వెల్లడించింది.
- Author : Gopichand
Date : 21-12-2022 - 10:31 IST
Published By : Hashtagu Telugu Desk
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు టీ20 లీగ్ లను ప్రకటించాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ వంటి దేశాలు టీ20 లీగ్ లను నిర్వహిస్తున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా బోర్డు సైతం టీ20 లీగ్ ను ప్రకటించింది. ఎస్ఏ టీ20 (SA20 league) పేరుతో నిర్వహించనున్న ఈ లీగ్ ప్రైజ్ మనీని తాజాగా వెల్లడించింది. ఈ టోర్నీకి మొత్తం 7 కోట్ల ర్యాండులు (రూ.33.35 కోట్లు) ప్రైజ్ మనీగా ఇవ్వనున్నట్లు లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ తెలిపారు.
దక్షిణాఫ్రికా ఫ్రాంచైజీ క్రికెట్ లో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద మొత్తం కావడం గమనార్హం. జనవరి 10 నుండి ఫిబ్రవరి 11 వరకు ఈ లీగ్ సాగనుంది. మొత్తం ఆరు జట్లు పాల్గొననున్న ఈ లీగ్ లో మొత్తం 33 మ్యాచ్ లు ఉంటాయి. కాగా, ఈ ఆరు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే కొనుగోలు చేయడం విశేషం. ఆరు జట్లు జోబర్గ్ సూపర్ కింగ్స్, MI కేప్ టౌన్, పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్స్ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ జట్లలో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు కనిపిస్తారు.
Also Read: Argentina players: అర్జెంటీనా ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం
R70 Million Prize Purse Announced. Now That’s What I call Cricket! https://t.co/LeymzVR16X #SA20 #Betway pic.twitter.com/ELPLkmK1iA
— Betway SA20 (@SA20_League) December 20, 2022