Asian Games – India Medals : ఆసియా క్రీడల్లో ఇండియా బోణీ.. షూటింగ్, రోయింగ్, మహిళల క్రికెట్‌లో పతకాలు
Asian Games - India Medals : ఆసియా గేమ్స్ లో ఇండియా ప్లేయర్స్ సత్తా చాటుతున్నారు.
- Author : Pasha
Date : 24-09-2023 - 11:47 IST
Published By : Hashtagu Telugu Desk
Asian Games – India Medals : ఆసియా గేమ్స్ లో ఇండియా ప్లేయర్స్ సత్తా చాటుతున్నారు. ఇవాళ మహిళల షూటింగ్, పురుషుల రోయింగ్‌తో పాటు మహిళల క్రికెట్‌లో భారత్ కు పతకాలు వచ్చాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఇండియా రజిత పతకం సాధించింది. ఈ ఈవెంట్‌లో మెహులీ ఘోష్, రమిత, ఆషి చౌక్సే షూటర్లతో కూడిన భారత జట్టు.. 1886 స్కోర్‌తో రెండో స్ధానంలో నిలిచి సిల్వర్ మెడల్ ను కైవసం చేసుకుంది. ఇదే ఈవెంట్‌లో 1896 స్కోర్‌తో మొదటి స్ధానంలో నిలిచిన చైనా గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకుంది. మరోవైపు రోయింగ్‌లో కూడా భారత్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. రోయింగ్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్లో అర్జున్ లాల్, అరవింద్ సింగ్ రెండో స్ధానంలో నిలిచారు.
Also read : Viral Video: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న చాచాజీ లుంగీ డ్యాన్స్
మహిళల క్రికెట్‌లోనూ భారత్‌కు పతకం ఖరారైంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను భారత్ చిత్తుగా ఓడించి, ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ 51 పరుగులకే కుప్పకూలింది. ఒకే ఒక్క బ్యాటర్ రెండంకెల స్కోర్ సాధించగా.. 9 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. వీరిలో ఐదుగురు డకౌటయ్యారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4 వికెట్లు పడగొట్టింది. టిటాస్ సాధు, అమోన్‌జోత్ కౌర్, గైక్వాడ్ , దేవిక ఒక్కో వికెట్ పడగొట్టారు. 52 పరుగుల టార్గెట్‌ను భారత మహిళల జట్టు 8.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ స్మృతి మంధాన 7 రన్స్‌కే ఔటైనా.. షెఫాలీ వర్మ 17, రోడ్రిగ్స్ 20 పరుగులతో రాణించారు. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో భారత్ స్వర్ణం (Asian Games – India Medals) కోసం పోటీ పడుతుంది.ఈసారి భారత్ నుంచి అత్యధికంగా 655 మంది క్రీడాకారులు ఆసియా క్రీడల్లో పోటీపడుతున్నారు. అథ్లెట్ల, హాకీ జట్లతో పాటుగా.. భారత మహిళా, పురుష క్రికెట్ జట్లు తొలిసారిగా ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్నాయి.