Viral Video: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న చాచాజీ లుంగీ డ్యాన్స్
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతీది వైరల్ అవుతుంది. మారుమూల ప్రాంతంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ కూడా క్షణాల్లో వైరల్ గా మారుతుంది.
- By Praveen Aluthuru Published Date - 11:32 AM, Sun - 24 September 23
Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతీది వైరల్ అవుతుంది. మారుమూల ప్రాంతంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ కూడా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇలా వైరల్ అయిన వీడియోలో కనిపించిన ఎందరో ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై సందడి చేస్తున్నారు. తాజాగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఓ పెద్దాయన వేసిన డ్యాన్స్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో వ్యక్తి పెళ్లిలో లుంగీ డ్యాన్స్ పాటపై సందడి చేశాడు. అతని స్టైల్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. క్షణాల్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే లుంగీ డాన్స్ కి తలైవా అంకుల్ అనే బిరుదు కూడా ఇచ్చాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఏదో పెళ్లి లేదా ఫంక్షన్‌కి సంబంధించినది. షారుఖ్ ఖాన్ చిత్రం చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోని ‘లుంగీ డాన్స్’ పాట ప్లే చేయడం ప్రారంభించినప్పుడు అందరూ DJ ఫ్లోర్‌పై డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. ఈ పాట విన్న ఒక పెద్దాయన వెంటనే స్టేజ్ పైకి ఎగిరి తన లుంగీని చూపిస్తూ లుంగీ డాన్స్ చేయడం మొదలుపెట్టాడు.స్టేజీ మొత్తాన్ని ఆక్రమిస్తూ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేసాయడం అందర్నీ ఆకట్టుకుంది.ఈ వీడియోని పప్పులన్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ అయింది. ఇప్పటి వరకు లక్షల మంది ఈ వీడియోను చూడగా, లక్షల మంది లైక్ చేశారు. చాలా మంది వినియోగదారులు దీనిపై ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదే నిజమైన లుంగీ డ్యాన్స్ అంటున్నారు.
Related News
Chiranjeevi: చిరంజీవి మేడే గ్రీటింగ్స్.. చైల్డ్ లేబర్ పై వీడియో షేరింగ్
Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మే డే సందర్భంగా ప్రజలకు, అభిమానులకు, సినీ కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ యాడ్ వీడియోను పోస్ట్ చేశారు. బాలకార్మిక వ్యవస్థ అనే సామాజిక దురాచారాన్ని రూపుమాపడానికి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ వో) చేస్తున్న ప్రచారం కోసం ఈ ప్రకటనను చిత్రీకరించినట్లు ఎక్స్ (ట్విట్టర్)లో చిరంజీవి ఒక పోస్ట్ లో పేర్కొన్నారు. ‘చిన్నిచేతులు’ ప�