HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Cricketer To Be Shifted To Mumbai

Rishabh Pant: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ముంబైకి తరలింపు

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) గతవారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో మ్యాక్స్ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. అయితే పంత్ ట్రీట్‌మెంట్‌పై ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(DDCA) తాజా అప్‌డేట్ ఇచ్చింది.

  • Author : Gopichand Date : 04-01-2023 - 1:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rishabh Pant
Rishabh Pant

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) గతవారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో మ్యాక్స్ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. అయితే పంత్ ట్రీట్‌మెంట్‌పై ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(DDCA) తాజా అప్‌డేట్ ఇచ్చింది. తదుపరి ట్రీట్‌మెంట్‌ కోసం పంత్‌ను డెహ్రాడూన్ నుంచి ముంబైకి తరలించనున్నట్లు డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు.

భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రూర్కీ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అతని చికిత్స డెహ్రాడూన్‌లో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) పెద్ద నిర్ణయం తీసుకుంది. DDCA చికిత్స కోసం పంత్‌ను ముంబైకి తీసుకెళ్లనుంది. డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ మాట్లాడుతూ.. క్రికెటర్ రిషబ్ పంత్‌ను తదుపరి చికిత్స కోసం ముంబైకి తరలించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 30న కారు ప్రమాదంలో గాయపడిన పంత్ డెహ్రాడూన్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పంత్ తలపై రెండు కుట్లు ఉన్నాయని బీసీసీఐ తెలిపింది. అతని కుడి మోకాలిలో గాయమైంది. కుడి మణికట్టు, చీలమండ, కాలికి కూడా గాయాలు ఉన్నాయి. అలాగే అతని వీపుపై రాపిడి గాయం ఉంది. పంత్ పరిస్థితి ప్రస్తుతం ప్రమాదంగా లేదు. అయితే ఇప్పుడు అతనికి మెరుగైన చికిత్స అందించాలని BCCI, DDCA నిర్ణయించాయి. త్వరలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని పంత్‌ను వీలైనంత త్వరగా ఫిట్‌గా ఉండేలా చూడాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read: Woman Suicide: హైదరాబాద్ లో మెట్రో రైల్వేస్టేషన్ పై నుండి దూకి మహిళ ఆత్మహత్య

పంత్ MRI స్కాన్ నివేదికలో ఎటువంటి సమస్య లేదు. ప్రమాదం తర్వాత పంత్‌తో నిరంతరం టచ్‌లో ఉండాలని, అతని పరిస్థితిని పర్యవేక్షించాలని BCCI.. DDCAని ఆదేశించింది. డీడీసీఏ చీఫ్ శ్యామ్ శర్మ స్వయంగా పంత్‌ను కలిసేందుకు వచ్చారు. అలాగే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా పంత్‌ను కలవడానికి ఆసుపత్రికి చేరుకున్నారు.

బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఆడిన తర్వాత పంత్ దుబాయ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి డిసెంబర్ 29న ఢిల్లీకి వచ్చి అక్కడి నుంచి కారులో రూర్కీలోని తన ఇంటికి వెళ్తున్నాడు. శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు భారత జట్టులో పంత్‌కు చోటు దక్కలేదు. ఇప్పుడు గాయం తర్వాత పంత్ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్, IPL 2023లో ఆడటంపై సందేహం ఉంది. మీడియా నివేదికల ప్రకారం.. పంత్ పూర్తిగా కోలుకోవడానికి నాలుగు నుండి ఆరు నెలలు పట్టవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • DDCA
  • mumbai
  • Rishabh Pant
  • Rishabh Pant Car Accident
  • sports

Related News

Rishabh Pant

ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

రిషభ్ పంత్ కెరీర్ తరచుగా గాయాల బారిన పడుతూనే ఉంది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభ ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా అతను పలుమార్లు గాయపడ్డాడు.

  • Ishan Kishan

    ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్‌- 10లోకి ఇషాన్ కిష‌న్‌!

  • Iran Oil Tankers

    ముంబై తీరంలో మూడు ఇరాన్ చమురు నౌకలను సీజ్!

  • T20 World Cup 2026

    పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

  • Hardik Pandya celebrates Valentine's Day with a tattoo of girlfriend Mahieka Sharma

    కొలంబో లో ప్రియురాలితో హోటల్ లాబీలో కనిపించిన పాండ్యా

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd