IND vs ENG : ఇంగ్లండ్ పై భారత్ ఘనవిజయం
IND vs ENG : 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు, ఒక దశలో గెలుపు దిశగా పరుగులుపెడుతున్న క్రమంలో
- Author : Sudheer
Date : 31-01-2025 - 10:47 IST
Published By : Hashtagu Telugu Desk
భారత్ . ఇంగ్లండ్ (IND vs ENG) ల మధ్య జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు, ఒక దశలో గెలుపు దిశగా పరుగులుపెడుతున్న క్రమంలో భారత బౌలర్లు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను తమ వైపు చేసుకున్నారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 15వ ఓవర్లో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను టర్న్ చేశారు. దూబేకు కంకషన్ సబ్స్టిట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. రవి బిష్ణోయ్ కూడా మూడు వికెట్లతో రాణించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ 51 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించారు.
ఈ విజయంతో భారత జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. సిరీస్‌లో భారత యువ ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించి, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇదే జోరును చివరి మ్యాచ్‌లో కూడా కొనసాగించాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.