Ind Vs WI : టార్గెట్ 3-0
వెస్టిండీస్ తో చివరి వన్డేకు టీమిండియా సిధ్ధమైంది. ఇప్పటికే సిరీస్ గెలుచుకున్న భారత్ క్లీన్ స్వీప్ పై కన్నేసింది.
- By Naresh Kumar Published Date - 11:10 AM, Fri - 11 February 22
వెస్టిండీస్ తో చివరి వన్డేకు టీమిండియా సిధ్ధమైంది. ఇప్పటికే సిరీస్ గెలుచుకున్న భారత్ క్లీన్ స్వీప్ పై కన్నేసింది. అహ్మదాబాద్ వేదికగానే జరగనున్న ఈ చివరి మ్యాచ్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న భారత్ తుది జట్టులో మార్పులు చేయబోతోంది. సిరీస్ ఫలితం తేలిపోయిన నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లకి విశ్రాంతి ఇచ్చి రిజర్వ్ బెంచ్‌పై ఉన్న యువ ఆటగాళ్లకి అవకాశం దక్కనుంది. 7 రోజుల క్రితం కరోనామహమ్మారి బారినపడిన శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ .. ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో రెండు సార్లు నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లో కరోనా నెగటివ్ రావడంతో.. ధావన్, అయ్యర్ తిరిగి జట్టుతో చేరారు. దీంతో మూడో వన్డేలో ధావన్, రోహిత్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. వన్ డౌన్ లో కోహ్లీ రానుండగా…కేఎల్ రాహుల్ మిడిలార్డర్ లో ఆడనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కొనసాగిస్తుండడం అడ్వాంటేజ్. అదే సమయంలో రిషబ్ పంత్ పేలవ ఫామ్ కలవరపెడుతోంది. భారీ అంచనాలు పెట్టుకున్న పంత్ వరుసగా విఫలమవుతుండడంతో తుది జట్టులో కొనసాగించాలా వద్దా అనే దానిపై రోహిత్ తర్జనభర్జన పడుతున్నాడు. అటు బౌలింగ్ లోనూ మార్పులు జరగనున్నాయి. గత మ్యాచ్ లో అదరగొట్టిన ప్రసిద్ధ కృష్ణ ను కొనసాగించనుండగా… హైదరాబాదీ పేసర్ సిరాజ్ కు విశ్రాంతినిచ్చే అవకాశముంది. సిరాజ్ స్థానంలో అవేశ్ ఖాన్ కు చోటు దక్కొచ్చు. ఇక స్పిన్ విభాగంలో చాహల్ ను పక్కనపెట్టి కుల్దీప్ , రవిబిష్ణోయ్ లలో ఒకరిని తీసుకుంటారని భావిస్తున్నారు. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడి సిరీస్ చేజార్చుకున్న వెస్టిండీస్ ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ లో బౌలర్లు రాణించినా.. బ్యాటింగ్ వైఫల్యంతో విండీస్ పరాజయం పాలైంది. దీంతో బ్యాటింగ్ గాడిన పడితే తప్ప ఫామ్ లో ఉన్న భారత్ ను నిలువరించడం విండీస్ కు కష్టమనే చెప్పాలి. ఫిట్ నెస్ సమస్యలతో గత మ్యాచ్ కు దూరమైన పొల్లార్డ్ లేకపోవడం వారికి మైనస్ పాయింట్. ఇదిలా ఉంటే అహ్మదాబాద్ పిచ్ మరోసారి పేసర్లకు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు.
Related News
KKR vs LSG: ఏ జట్టు గెలిచినా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమేనా..? నేడు లక్నో వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్..!
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు IPL 2024లో అత్యంత విజయవంతమైన రెండవ జట్టుగా నిలిచింది. 10 మ్యాచుల్లో 7 గెలిచిన ఈ జట్టు కేవలం మూడింటిలో మాత్రమే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.