IND vs SL Records: అరుదైన రికార్డు ముంగిట హిట్ మ్యాన్
సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వైట్ వాష్ చేసిన టీమిండియా ఇప్పుడు మరో సిరీస్ కు సిద్ధమైంది..
- By Hashtag U Published Date - 04:54 PM, Thu - 24 February 22

సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వైట్ వాష్ చేసిన టీమిండియా ఇప్పుడు మరో సిరీస్ కు సిద్ధమైంది.. మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా ఈ రోజు లక్నో వేదికగాశ్రీలంకతో టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ తొలి టీ20 మ్యాచ్ కు మందు టీమిండియా నయా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఓ అరుదైన వరల్డ్ రికార్డ్ పై కన్నేశాడు. తొలి టీ20 మ్యాచ్‌లో 36 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్ ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా హిట్ మ్యాన్ నిలువనున్నాడు.. ప్రస్తుతం ఈ జాబితాలో రోహిత్ శర్మ 3,263 పరుగులతో మూడో స్ధానంలో ఉండగా.. కివీస్ స్టార్ బ్యాటర్ మార్టిన్ గుప్టిల్ 3299 పరుగులతో తొలి స్ధానంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 3,296 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు…
అలాగే ఈ 3 మ్యాచుల టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ మరో వరల్డ్ రికార్డుపై కూడా కన్నేశాడు.. రోహిత్ శర్మ మరో 3 మ్యాచులు ఆడితే గనుక అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాడిగా రికార్డు సాదించనున్నాడు.. ఇప్పటివరకు 122 టీ ట్వంటీ మ్యాచ్ లు ఆడిన రోహిత్హిట్ మ్యాన్ ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 124 మ్యాచులతో తొలి స్థానంలో ఉన్నాడు.. ఇక టీమిండియా నుంచి రోహిత్ శర్మ తరువాతి స్థానాల్లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 98 మ్యాచులలో , మాజీ సారథి విరాట్ కోహ్లీ 97 మ్యాచులతో ఉన్నారు. ఇక టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలవాలంటే ఈ రోజు మ్యాచులో రోహిత్ శర్మ 63 పరుగులు సాధించాల్సి ఉంది. ఈ జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ముందు ఉన్నాడు.