IND vs SA 1st Test: నేటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్ట్.. వెదర్ రిపోర్ట్ ఇదే..!
నేటి నుంచే సౌతాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్ట్ (IND vs SA 1st Test) ఆరంభం కానుంది. ఇప్పటివరకు టీమిండియా జట్టు సౌతాఫ్రికాలో అనేక సార్లు పర్యటించినప్పటికీ ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేదు.
- By Gopichand Published Date - 07:31 AM, Tue - 26 December 23

IND vs SA 1st Test: నేటి నుంచే సౌతాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్ట్ (IND vs SA 1st Test) ఆరంభం కానుంది. ఇప్పటివరకు టీమిండియా జట్టు సౌతాఫ్రికాలో అనేక సార్లు పర్యటించినప్పటికీ ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేదు. ఇంతకు ముందు పరిస్థితి వేరు. ఇప్పటి పరిస్థితి వేరని చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ చెబుతున్నారు. మన సిరీస్ ఆకలిని రోహిత్ సేన తీరుస్తుందని కామెంట్ చేస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో మ్యాచ్ జరగనుంది.
నేటి నుంచి (మంగళవారం) భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్‌లో జరగనుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను చేజిక్కించుకున్న హుషారులో భారత్ జట్టు ఉంది. అదే ఊపుతో టెస్టుల్లోనూ బరిలోకి దిగుతోంది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత పురుషుల జట్టు ఇప్పటివరకు టెస్ట్ సిరీస్‌ను గెలిచిన దాఖలాలు లేవు. ఈ గడ్డపై ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు మాత్రమే సఫారీ జట్టు సిరీస్‌ను సాధించాయి. దీంతో భారత్‌కు ఇప్పటివరకు అందని ద్రాక్షగా ఉన్న సఫారీ గడ్డపై సిరీస్‌ను చేజిక్కించుకోవాలన్న దృఢ నిశ్చయంతో బరిలోకి దిగుతోంది. ఇక్కడి పిచ్‌లో పేస్‌కు అనుకూలిస్తాయి కాబట్టి నలుగురు పేసర్లతో బరిలోకి దిగినా ఆశ్చర్యపోన్నక్కర్లేదు.
Also Read: IND vs SA: దక్షిణాఫ్రికాలో రోహిత్-విరాట్ రికార్డు ఎలా ఉంది..? ఈ సిరీస్‌లో రాణిస్తారా..?
2022 జనవరిలో చివరిసారిగా భారత్, దక్షిణాఫ్రికాలు టెస్టు మ్యాచ్ ఆడాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరు జట్లు ఒకదానితో ఒకటి టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. గతసారి మూడు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1తో కైవసం చేసుకుంది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ డిసెంబర్ 26న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో ఒక్క సిరీస్‌లో కూడా దక్షిణాఫ్రికాను ఓడించని టీమిండియా ఈసారి తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
వెదర్ రిపోర్ట్
మంగళవారం నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్‌లో జరగనుంది. వర్షం కారణంగా సెంచూరియన్ టెస్టు తొలిరోజు ఆట రద్దయ్యే అవకాశం ఉంది. వెదర్ రిపోర్ట్ ప్రకారం.. మంగళవారం సెంచూరియన్‌లో భారీవర్షం కురిసే అవకాశం ఉంది. 90 నుంచి 92 శాతం వరకు వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక్కడ ఆడిన 28 టెస్టుల్లో 22 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా.. గత పర్యటనలో భారత్ సాధించిన ఏకైక విజయం ఇక్కడే నమోదైంది.