IND vs ENG: ఐదవ టెస్ట్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. గిల్‌కు గాయం?!
మాంచెస్టర్ టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయం తీవ్రత కారణంగా అతను నాల్గవ టెస్ట్‌లో వికెట్ కీపింగ్ చేయడానికి కూడా రాలేదు.
- By Gopichand Published Date - 09:16 PM, Sun - 27 July 25

IND vs ENG: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టుకు (IND vs ENG) గాయాల బెడద అధికమవుతోంది. ఇప్పటికే వికెట్ కీపర్ రిషబ్ పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో గాయపడి ఐదవ టెస్ట్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు జట్టు సారథి శుభ్‌మన్ గిల్ కూడా గాయపడటంతో టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది.
రిషబ్ పంత్ దూరం
మాంచెస్టర్ టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయం తీవ్రత కారణంగా అతను నాల్గవ టెస్ట్‌లో వికెట్ కీపింగ్ చేయడానికి కూడా రాలేదు. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. పంత్ ఐదవ టెస్ట్ మ్యాచ్ నుండి కూడా పూర్తిగా వైదొలిగాడు. ఇది భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.
Also Read: Lemon Juice : తరచుగా నిమ్మరసం తాగే అలవాటు ఉన్నవారికి బీ అలర్ట్… మీకోసమే షాకింగ్ న్యూస్
శుభ్‌మన్ గిల్ గాయంపై ఆందోళన
పంత్ గాయం నుంచి కోలుకోకముందే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా గాయపడటం జట్టును మరింత కలవరపెడుతోంది. రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో గిల్ చేతికి బంతి తగిలింది. దీంతో అతను గాయపడటంతో బ్యాండేజ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత గిల్ 90 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బెన్ స్టోక్స్ వేసిన బంతి నేరుగా అతని చేతికి తగిలింది. ఆ సమయంలో గిల్ తీవ్ర నొప్పితో కనిపించినప్పటికీ అతను మొక్కవోని దీక్షతో సెంచరీ సాధించి ఆ తర్వాత ఔటయ్యాడు.
అయితే గిల్ ఇప్పటికే గాయంతో బాధపడుతుండగా మరోసారి గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ శుభ్‌మన్ గాయం తీవ్రమైతే, అతను కూడా ఐదవ టెస్ట్ మ్యాచ్ నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది టీమిండియాకు మరింత పెద్ద నష్టంగా మారుతుంది. ముఖ్యంగా కీలకమైన ఐదవ టెస్ట్‌కు ముందు. శుభ్‌మన్ గిల్ గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత రాలేదు. అతను ఐదవ టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది వైద్యుల నివేదికపై ఆధారపడి ఉంటుంది. ఈ గాయాలు భారత జట్టు ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.