IND v SL 2022 : కోహ్లి వందో టెస్ట్ ఎక్కడో తెలుసా ?
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వందో టెస్టుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
- By Naresh Kumar Published Date - 05:23 PM, Thu - 3 February 22

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వందో టెస్టుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కోహ్లీకి ఈ మ్యాచ్ ప్రత్యేకంగా నిలిచిపోయేలా ప్లాన్ చేస్తోంది. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో భాగంగా కోహ్లీ వందో టెస్టును బెంగళూర్ వేదికగా గులాబీ బంతితో డే నైట్ మ్యాచ్ గా మార్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ బాస్ గంగూలీ వెల్లడించాడు.నిజానికి కోహ్లి పుట్టి పెరిగింది ఢిల్లీ అయినా బెంగళూరుతో అతడిది ప్రత్యేక అనుబంధం. ఐపీఎల్ ఆరంభం నుంచీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతుండడంతో అక్కడ అభిమానులతో మంచి రిలేషన్ ఏర్పడింది. ఈ కారణంగానే బీసీసీఐ కోహ్లీ వందో టెస్ట్ అక్కడ నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. వెస్టిండీస్ తో వన్డేలు, టీ20 సిరీస్ ముగిశాక భారత జట్టు శ్రీలంక ఢీకొనబోతున్నది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగించుకుని నేరుగా భారత్ కు చేరుకునే శ్రీలంక.. ఇక్కడ భారత్ తో మూడు టీ20 లు, రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది. బెంగళూరు, మొహాలీ వేదికగా రెండు టెస్టులను నిర్వహించనుంది. ఇదిలా ఉండగా.. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరుగబోయే టెస్టు.. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లికి వందో టెస్టు కానుంది. విరాట్ కోహ్లీ 68 టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టు కెప్టెన్‌గా కొనసాగాడు. వీటిలో 40 మ్యాచ్‌లు గెలిపించిన కోహ్లీ…17 మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యాడు. 11 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. భారత్‌కు టెస్టుల్లో ఇన్ని విజయాలు సాధించిన కెప్టెన్ మరెవరూ లేరు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లికి వందో టెస్టును చిరస్మరణీయంగా చేయాలనుకున్న దాదా డే నైట్ టెస్ట్ గా ఏర్పాటు చేయనున్నాడు.