T20 World Cup 2024: భారత్ – పాక్ మ్యాచ్.. ఐసీసీ కీలక నిర్ణయం
న్యూయార్క్‌లోని నసావు కౌంటీ మైదానం పిచ్ చాలా అధ్వాన్నంగా ఉంది. దీంతో ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. నసావు స్టేడియం ఆటగాళ్లనే కాదు నిపుణులను కూడా నిరాశపరిచింది. దీంతో ఐసీసీ రాబోయే మ్యాచ్‌లను న్యూయార్క్ నుండి వేరే చోటికి మార్చొచ్చని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
- By Praveen Aluthuru Published Date - 04:32 PM, Fri - 7 June 24

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ ను అమెరికా మరియు వెస్టిండీస్‌లో నిర్వహించాలని ICC నిర్ణయించినప్పుడు పలువురు స్వాగతించారు. ఐసీసీ తీసుకున్న నిర్ణయం ద్వారా అమెరికాలో క్రికెట్‌ను ప్రోత్సహించినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. కానీ టీ20 ప్రపంచ కప్ మొదలైన తర్వాత అసలు విషయం బయటపడింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ మైదానం పిచ్ చాలా అధ్వాన్నంగా ఉంది. దీంతో ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారు.
నసావు స్టేడియం ఆటగాళ్లనే కాదు నిపుణులను కూడా నిరాశపరిచింది. దీంతో ఐసీసీ రాబోయే మ్యాచ్‌లను న్యూయార్క్ నుండి వేరే చోటికి మార్చొచ్చని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అమెరికాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ల సందర్భంగా కొంత వివాదం జరిగింది. భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు బ్యాట్స్‌మెన్లు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పిచ్ బౌన్స్ కారణంగా రోహిత్ శర్మ గాయపడ్డాడు, ఆ తర్వాత అతను మైదానం నుండి నిష్క్రమించాడు. పంత్ మైదానాన్ని వీడనప్పటికీ గాయపడ్డాడు.
నసావు స్టేడియంలో బంతి చాలా వేగంగా కదులుతోంది, అందుకే ఇప్పటి వరకు ఈ మైదానంలో ముందుగా ఆడుతున్న జట్టు 100 పరుగుల మార్కును కూడా తాకలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పిచ్‌పై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జూన్ 9న న్యూయార్క్‌లోని నసావు స్టేడియంలో భారత్-పాక్ జట్ల మధ్య భీకర మ్యాచ్ జరగనుండడంతో ఇరు జట్ల మధ్య టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పిచ్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్‌ల డేటాను ఐసీసీ విశ్లేషిస్తోన్నట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ ఏ మ్యాచ్ జరిగినా ఇక్కడే ఆడతారు తప్ప వేరే చోటికి మార్చరు. కాకపోతే పిచ్ ను వేరే చోట నుంచి ఈ మైదానంలోకి తీసుకురానున్నారు. అయితే అడిలైడ్ నుంచి పిచ్‌ను తీసుకొచ్చినప్పటికీ , అది ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదని పిచ్ మాస్టర్లు చెబుతున్నారు.
Also Read: TDP: టీడీపీ జీరో టాలరెన్స్.. అధికారుల్లో ఒణుకు