ICC Bans Transgender Players: అంతర్జాతీయ క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లపై ఐసీసీ నిషేధం..!
అంతర్జాతీయ క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లపై ఐసీసీ నిషేధం (ICC Bans Transgender Players) విధించిన నేపథ్యంలో ప్రపంచంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ క్రికెటర్ డేనియల్ మెక్‌గాహే రిటైర్మెంట్ ప్రకటించింది.
- By Gopichand Published Date - 05:18 PM, Wed - 22 November 23

ICC Bans Transgender Players: అంతర్జాతీయ క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లపై ఐసీసీ నిషేధం (ICC Bans Transgender Players) విధించిన నేపథ్యంలో ప్రపంచంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ క్రికెటర్ డేనియల్ మెక్‌గాహే రిటైర్మెంట్ ప్రకటించింది. కెనడా కోసం ఆడుతున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ క్రికెటర్ డానియెల్ మెక్‌గాహే.. ఐసిసి ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే రిటైర్మెంట్ ప్రకటించి, తన నిరాశను కూడా వ్యక్తం చేసింది.
తన రిటైర్‌మెంట్‌ను ప్రకటిస్తూ.. ఐసీసీ నిర్ణయంపై నా స్వంత అభిప్రాయం ఏమిటంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ట్రాన్స్ మహిళలకు ఒక సందేశం పంపబడింది. అందులో మాకు హక్కులు లేవు. క్రీడల్లో మన సమానత్వం కోసం పోరాడడాన్ని నేను ఎప్పటికీ ఆపనని వాగ్దానం చేస్తున్నాను. అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడే హక్కు మాకు ఉంది. ఈ గేమ్ భద్రత, సమగ్రతకు మేము ఎటువంటి ముప్పును కలిగించం అని పేర్కొంది.
Also Read: 2027 ODI World Cup: 2027 ప్రపంచ కప్ కు ఈ ఆటగాళ్లు కష్టమే..? టీమిండియా నుంచి ఇద్దరు..?
డేనియల్ మెక్‌గాహే ఎవరు?
మెక్‌గాహే ఏప్రిల్ 1994లో ఆస్ట్రేలియాలో జన్మించారు. తన జీవితంలో 26 సంవత్సరాలు గడిపిన తర్వాత ఫిబ్రవరి 2020లో కెనడాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మే 2021లో తన వైద్య పరివర్తనను ప్రారంభించిన వెంటనే క్రికెటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అయితే కెనడా దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత డేనియల్ కెనడియన్ మహిళల క్రికెట్ జట్టులో అవకాశాలు పొందడం ప్రారంభించింది. ఆ తర్వాత కెనడా అంతర్జాతీయ క్రికెట్ జట్టులో చేరిన తొలి ట్రాన్స్‌జెండర్ క్రికెటర్‌గా కూడా డానియెల్ గుర్తింపు పొందారు. ఆమె 2023 మహిళల T20 నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో తన జట్టు కెనడా కోసం అద్భుత ప్రదర్శన చేసింది. కేవలం 3 ఇన్నింగ్స్‌ల బ్యాటింగ్‌లో 237 పరుగులు చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
డేనియల్ మొత్తం 6 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు
తన అంతర్జాతీయ కెరీర్‌లో కెనడా తరపున మొత్తం 6 క్రికెట్ మ్యాచ్‌లు ఆడారు. అయితే కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. ఎందుకంటే ఐసిసి నిర్ణయం ఇచ్చింది. ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేరని చెప్పారు. ICC ఈ కొత్త నిర్ణయం తర్వాత డేనియల్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. తన ప్రకటన ద్వారా తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు.