HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >I Felt Bad After Breaking My Bat Sanju Samson

IPL 2022:క్రికెట్ వదిలేద్దామనుకున్నా..

ఐపీఎల్‌-2022లో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్ అటు సారథిగా ఇటు బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్ 298 పరుగులు చేశాడు.

  • Author : Naresh Kumar Date : 04-05-2022 - 2:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sanju Samson
Sanju Samson

ఐపీఎల్‌-2022లో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్ అటు సారథిగా ఇటు బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్ 298 పరుగులు చేశాడు. ప్రసుతం శాంసన్ సారథ్యంలోని రాజస్తాన్‌ రాయల్స్ జట్టు 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అయితే ఈ సీజన్ లో సంజు శాంసన్ ఇదే నిలకడైన ఆటతీరును కొనసాగిస్తే .. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఇదిలాఉంటే.. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్ తో జరిగిన ఇంటర్వ్యూలో సంజూ శాంసన్ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ముఖ్యంగా గత ఐదేళ్లలోతాను తీవ్ర మానసిక వేదనకి గురైనట్లు తెలిపాడు. నేను 20 ఏళ్ళ వయసులో జాతీయ జట్టులోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత మళ్లీ 5 ఏళ్లకు మళ్ళి టీంఇండియాలో ఛాన్స్ దొరికింది. నా లైఫ్ లో ఈ ఐదేళ్ల కాలం చాలా కష్టంగా గడిచింది. ఎప్పుడు చిరాకుగా ఉండేవాడిని. ఓ సారి బ్రబౌర్న్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఔటయ్యానన్న కోపంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లగానే బ్యాట్‌ విసిరేశాను. అలాగే ఆ మ్యాచ్‌ జరుగుతుండగానే స్టేడియం నుంచి బయటకు వెళ్ళిపోయాను. ఆ సమయంలో క్రికెట్‌ వదిలేద్దామనుకున్నా.. అలా ఆలోచిస్తూ బాగా పొద్దుపోయాక డ్రెస్సింగ్ రూమ్ కి తిరిగి వచ్చాను. అప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో నేను కోపంలో విరిరేసిన నా బ్యాట్‌ ముక్కలై ఉంది. దాంతో నా మీద నాకే కోపం వచ్చిందని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2022
  • rajasthan royals
  • sanju broke his bat
  • Sanju Samson
  • team india

Related News

Only by doing this will India reach the Women's T20 World Cup semi-finals... otherwise, it's back home!

Women’s T20 World Cup 2026: ఇలా చేస్తేనే మహిళల T20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్ కు ..లేదంటే ఇంటికే..!

మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భారత జట్టు విజయాల పరంపరకు బ్రేక్ పడింది. ఆదివారం జరిగిన హోరాహోరీ గ్రూప్-1 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన మారిజెన్ కాప్ (81 పరుగులు, 2/27) దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించి, ఆ జట్టు సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచింది. ప్రస్తుత టోర్నీలో భారత్‌కు ఇదే తొలి ఓటమి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ

    Latest News

    • Tirumala School: తిరుమల స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్య.. అసలు నిజం ఇదే..

    • Nara Rohit: నారా వారి ఇంట మ‌రో వార‌సుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీష

    • Kodali Nani: ఏపీ హైకోర్టుకు మాజీ మంత్రి కొడాలి నాని

    • Rain Alert: తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన

    • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd