Mohammed Shami: టీమిండియా స్టార్ బౌలర్ షమీ సంపాదన ఎంతో తెలుసా?
హసీన్ జహాన్ మోడలింగ్, నటన రంగంలో చాలా చురుకుగా ఉంటుంది. ఫ్యాషన్ షూట్స్, యాడ్ ఫిల్మ్స్‌తో పాటు బెంగాలీ చిత్ర పరిశ్రమలోని కొన్ని చిన్న చిత్ర ప్రాజెక్ట్‌ల నుంచి కూడా ఆమెకు ఆదాయం వస్తుంది.
- By Gopichand Published Date - 05:50 PM, Wed - 2 July 25

Mohammed Shami: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) మరోసారి వార్తల్లో నిలిచాడు. కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఒక నిర్ణయం తీసుకుంది. మహ్మద్ షమీ తన భార్య హసీన్ జహాన్‌కు ప్రతి నెలా 4 లక్షల రూపాయలు భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇందులో ప్రతి నెలా 1.5 లక్షల రూపాయలు భార్య హసీన్ జహాన్‌కు, 2.5 లక్షల రూపాయలు కూతురు ఆయిరాకు చెల్లించాలని తెలిపింది.
గతంలో షమీ 1,30,000 రూపాయలు చెల్లించేవాడు
మహ్మద్ షమీకి ఇది ఒక షాక్ లాంటిది. ఎందుకంటే గతంలో అతను భరణంగా నెలకు 1,30,000 రూపాయలు చెల్లించేవాడు. ఇప్పుడు నేరుగా 4 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. షమీ తన కూతురు మంచి చదువు, సంరక్షణ కోసం అదనంగా కూడా డబ్బు ఇవ్వవచ్చని కోర్టు సూచించింది.
షమీ నెట్‌వర్త్
2025 నాటికి షమీ నెట్‌వర్త్ 55 కోట్ల నుంచి 65 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని అంచనా. అతనికి BCCI నుంచి మంచి జీతం లభిస్తుంది. అంతేకాకుండా టీ20, టెస్ట్, వన్డే మ్యాచ్‌ల కోసం కూడా అతను లక్షల్లో ఫీజు తీసుకుంటాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కూడా అతని ఆదాయానికి మంచి మూలం. ఈ నేపథ్యంలో షమీ ఎక్కువ మొత్తం చెల్లించే సామర్థ్యం ఉన్నాడని కోర్టు భావించింది. భార్య హసీన్ జహాన్ వద్ద ఎంత డబ్బు ఉందో తెలుసుకుందాం.
Also Read: IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీమిండియా రెండో టెస్ట్.. ముగ్గురూ ఆటగాళ్లు ఔట్!
హసీన్ జహాన్‌కు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?
హసీన్ జహాన్ మోడలింగ్, నటన రంగంలో చాలా చురుకుగా ఉంటుంది. ఫ్యాషన్ షూట్స్, యాడ్ ఫిల్మ్స్‌తో పాటు బెంగాలీ చిత్ర పరిశ్రమలోని కొన్ని చిన్న చిత్ర ప్రాజెక్ట్‌ల నుంచి కూడా ఆమెకు ఆదాయం వస్తుంది. షమీ నుంచి ఆమెకు లక్షల రూపాయలు భరణంగా లభిస్తున్నాయి. అంతేకాకుండా ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 3.9 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్‌బుక్‌లో కూడా 1.46 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఎక్స్‌లో 4000 కంటే ఎక్కువ మంది ఆమెను ఫాలో చేస్తున్నారు. తన సోషల్ మీడియా పేజీల ద్వారా బ్రాండ్ ప్రమోషన్, పెయిడ్ పార్టనర్‌షిప్‌లు, షార్ట్ వీడియో కంటెంట్ ద్వారా ఆమెకు మంచి ఆదాయం వస్తుంది.
వివాదం ఏమిటి?
మార్చి 2018లో హసీన్ జహాన్ మహ్మద్ షమీపై గృహ హింస ఆరోపణలు చేసింది. అంతేకాకుండా ఇతర మహిళలతో సంబంధాలు కలిగి ఉన్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా చేసింది. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది. వీరిద్దరూ చట్టపరంగా విడిపోలేదు. కానీ వేర్వేరుగా జీవిస్తున్నారు. వారి కూతురు హసీన్ జహాన్‌తో ఉంటోంది. భార్య చేసిన ఆరోపణలపై మహ్మద్ షమీ ఈ ఆరోపణలు తనపై, తన కుటుంబంపై చేస్తున్న కుట్ర అని చెప్పాడు.