World Cup 2023: ప్రపంచ కప్ దగ్గరపడుతోంది, హోటళ్లు యమ కాస్ట్లీ గురూ..
ఈ ఏడాది సొంతగడ్డపై ప్రపంచ కప్ మెగా టోర్నీ జరగనుంది.అయితే రోజురోజుకు చాలా రిచ్ టోర్నీగా మారుతుంది. ఎందుకంటే ఈ మెగా టోర్నీ హోటల్ వ్యాపారాలకు కాసులు కురిపిస్తుంది. ఇటీవల దేశంలో జరిగిన G20 సమావేశం నుండి క్రికెట్ ప్రపంచ కప్ నిర్వహణ వరకు హోటల్ నిర్వాహకులు లక్షలు పోగేసుకున్నారు
- By Praveen Aluthuru Published Date - 10:36 AM, Mon - 2 October 23
World Cup 2023: ఈ ఏడాది సొంతగడ్డపై ప్రపంచ కప్ మెగా టోర్నీ జరగనుంది.అయితే రోజురోజుకు చాలా రిచ్ టోర్నీగా మారుతుంది. ఎందుకంటే ఈ మెగా టోర్నీ హోటల్ వ్యాపారాలకు కాసులు కురిపిస్తుంది. ఇటీవల దేశంలో జరిగిన G20 సమావేశం నుండి క్రికెట్ ప్రపంచ కప్ నిర్వహణ వరకు హోటల్ నిర్వాహకులు లక్షలు పోగేసుకున్నారు. ప్రపంచ కప్ 2023 వివిధ నగరాల్లో నిర్వహించబడుతుంది. దీంతో నగరంలో హోటల్ బుకింగ్స్ పెరిగాయి. దీంతో గదుల అద్దె భారీగా పెరిగింది. క్రికెట్ మ్యాచ్ నిర్వహించబడే నగరాలు. అక్కడ హోటల్ గది అద్దె దాదాపు 15 రెట్లు పెరిగింది. MakeMyTrip, Oyo మరియు Yatra Online నుండి బుకింగ్స్ ప్రకారం అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా మరియు ధర్మశాలలో హోటళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు మరియు గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రాజేష్ మాగో మాట్లాడుతూ భారత క్రికెట్ జట్టు ఆడబోయే అన్ని నగరాల్లో హోటళ్లు మరియు హోమ్‌స్టేలతో సహా వసతి సౌకర్యాల బుకింగ్‌లు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు. అహ్మదాబాద్‌లో మ్యాచ్ డే బుకింగ్‌లు ఎక్కువగానే ఉన్నాయని ఆయన అన్నారు. ఆగస్టులో సగటు రోజువారీ బుకింగ్‌లతో పోలిస్తే హోటల్ మరియు హోమ్‌స్టే బుకింగ్‌లు 200 శాతం పెరిగాయి. అదే విధంగా, ధర్మశాలలో మ్యాచ్ రోజున బుకింగ్ ఆగస్టులో సగటు రోజువారీ బుకింగ్‌లో 605 శాతానికి పెరిగిందని ఆయన చెప్పారు.
లక్నోలో భారత్ మ్యాచ్ జరిగే రోజు సగటు రోజువారీ బుకింగ్ కంటే 50 శాతం ఎక్కువ ధరలు ఉన్నాయని రాజేష్ మాగో చెప్పారు. మ్యాచ్ రోజులు సమీపిస్తున్న తరుణంలో హోటల్ గదుల అద్దెలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చే నగరాలు, ముఖ్యంగా అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ మరియు కోల్‌కతాలో డిమాండ్‌లో సాధారణం కంటే ఎక్కువ పెరుగుదలను చూస్తున్నామని ఓయో ప్రతినిధి తెలిపారు. ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అహ్మదాబాద్ అక్టోబరు, నవంబర్ల బుకింగ్స్‌లో 777 శాతం పెరుగుదలతో ముందంజలో ఉందన్నారు. ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్ అక్టోబర్ 5న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్‌లో జరగనుంది. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కూడా అక్టోబర్ 14న ఇక్కడే జరుగుతుంది. ఫైనల్ కూడా నవంబర్ 19న ఇక్కడే జరుగుతుంది.
మ్యాచ్‌లను నిర్వహించే ప్రధాన వేదికలకు విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. మ్యాచ్‌ల రోజుల్లో విమాన ఛార్జీలు రెండు-మూడు రెట్లు పెరిగితే నాలుగు-ఫైవ్ స్టార్ హోటళ్ల ఛార్జీలు 10-15 రెట్లు పెరిగాయి. ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిచ్చే నగరాల్లో త్రి స్టార్ హోటల్స్ మరియు ఫైవ్ స్టార్ హోటల్స్ లో గదుల ధరలు రెట్టింపు అయ్యాయి.
ప్రపంచ కప్ షెడ్యూల్ 2023 పూర్తి షెడ్యూల్:
అక్టోబర్ 5 – ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ – అహ్మదాబాద్
6 అక్టోబర్- పాకిస్థాన్ vs క్వాలిఫయర్-1 – హైదరాబాద్
అక్టోబర్ 7- బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్- ధర్మశాల
8- అక్టోబర్- భారత్ vs ఆస్ట్రేలియా- చెన్నై
9- అక్టోబర్- న్యూజిలాండ్ vs క్వాలిఫయర్-1 హైదరాబాద్
10- అక్టోబర్- ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్- ధర్మశాల
11- అక్టోబర్- భారత్ vs ఆఫ్ఘనిస్తాన్- ఢిల్లీ
12- అక్టోబర్- పాకిస్థాన్ vs క్వాలిఫయర్-2 – హైదరాబాద్
13- అక్టోబర్- ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా – లక్నో
14- అక్టోబర్ – న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ – చెన్నై
15- అక్టోబర్- భారత్ vs పాకిస్థాన్ – అహ్మదాబాద్
16- అక్టోబర్ – ఆస్ట్రేలియా vs క్వాలిఫైయర్-2 – లక్నో
17 అక్టోబర్ – దక్షిణాఫ్రికా vs క్వాలిఫైయర్ 1 – ధర్మశాల
18- అక్టోబర్- న్యూజిలాండ్ vs ఆఫ్ఘనిస్తాన్- చెన్నై
19- అక్టోబర్- భారత్ vs బంగ్లాదేశ్ – పూణే
20- అక్టోబర్- ఆస్ట్రేలియా vs పాకిస్థాన్- బెంగళూరు
21- అక్టోబర్- ఇంగ్లండ్ -దక్షిణాఫ్రికా – ముంబై
22- అక్టోబర్- క్వాలిఫైయర్-1 vs క్వాలిఫైయర్-2 – లక్నో
23- అక్టోబర్- భారత్ vs న్యూజిలాండ్- ధర్మశాల
24- అక్టోబర్- దక్షిణాఫ్రికా vs క్వాలిఫయర్-2 – ఢిల్లీ
Also Read: TSRTC : దసరా స్పెషల్ బస్సుల్లో ఒక్క రూపాయి కూడా అదనపు ఛార్జ్ లేదు
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.