Asia Cup: ఆసియా కప్ టీ20 చరిత్రలో అత్యధిక స్కోర్ల జాబితా ఇదే!
అదే మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. అయితే, ఇంత పెద్ద స్కోర్ సాధించినప్పటికీ వారు గెలవలేకపోయారు.
- By Gopichand Published Date - 05:10 PM, Wed - 27 August 25

Asia Cup: టీ20 క్రికెట్‌లో పరుగుల వర్షం ఎప్పుడూ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఆసియా కప్ (Asia Cup) టీ20 టోర్నమెంట్‌లో కూడా బ్యాట్స్‌మెన్లు బౌలర్లను చిత్తు చేసి భారీ స్కోర్లు సాధించారు. ఈ టోర్నమెంట్‌లో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసియా కప్ టీ20 చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్ల టాప్-5 జాబితా ఇప్పుడు చూద్దాం.
ఆసియా కప్ టీ20లో అత్యధిక టీమ్ స్కోర్లు
భారత్ vs అఫ్గానిస్తాన్ – (2022, దుబాయ్)
- మొత్తం స్కోర్: 212/2
2022 ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అత్యధిక స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ చేసి ఆ రాత్రిని చిరస్మరణీయం చేశాడు. ఇది ఇప్పటి వరకు ఆసియా కప్ టీ20లో అత్యధిక స్కోర్. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో అఫ్గానిస్తాన్ విఫలమైంది.
పాకిస్తాన్ vs హాంగ్‌కాంగ్ – (2022, షార్జా)
- మొత్తం స్కోర్: 193/2
అదే ఏడాది షార్జాలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ హాంగ్‌కాంగ్ బౌలర్లను ఉతికి ఆరేసింది. కెప్టెన్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ అద్భుతమైన భాగస్వామ్యంతో 193 పరుగులు సాధించారు. ఈ స్కోర్ హాంగ్‌కాంగ్‌కు చాలా కష్టంగా మారింది. పాకిస్తాన్ ఈ మ్యాచ్‌ను సులభంగా గెలిచి తమ బలాన్ని నిరూపించుకుంది. ఇది ఆసియా కప్ టీ20 చరిత్రలో పాకిస్తాన్‌కు అత్యధిక స్కోర్.
Also Read: Realme Phone : రియల్ మీ నుంచి 15000 ఎంఏహెచ్ బ్యాటరీ..ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
భారత్ vs హాంగ్‌కాంగ్ – (2022, దుబాయ్)
- మొత్తం స్కోర్: 192/2
ఈ జాబితాలో భారత్ మరోసారి మూడో స్థానంలో ఉంది. 2022లో హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా భారత్ మెరుపులు మెరిపించింది. 20 ఓవర్లలో 192 పరుగులు చేసి కేవలం 2 వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు.
శ్రీలంక vs బంగ్లాదేశ్ – (2022, దుబాయ్)
- మొత్తం స్కోర్: 184/8
2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. శ్రీలంక 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఇన్నింగ్స్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్లు సమన్వయం, దూకుడు రెండింటినీ అద్భుతంగా ప్రదర్శించారు.
బంగ్లాదేశ్ vs శ్రీలంక – (2022, దుబాయ్)
- మొత్తం స్కోర్: 183/7
అదే మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. అయితే, ఇంత పెద్ద స్కోర్ సాధించినప్పటికీ వారు గెలవలేకపోయారు. చివరి ఓవర్లలో శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ టోర్నమెంట్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది.