RCB New Captain: ఆర్సీబీకి కొత్త కెప్టెన్ దొరికేసినట్టేనా? ఇంతకీ ఆర్సీబీ దగర ఉన్న ఆప్షన్స్ ఏంటి?
ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మెగా వేలానికి ముందు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. తమ కెప్టెన్ డుప్లెసిస్‌ను వదిలేసిన ఆర్సీబీ, కొత్త కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి మళ్ళీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం వచ్చింది. అయితే, ఆర్సీబీకి ఇప్పుడు మరో కెప్టెన్సీ ఆప్షన్ కూడా లభించింది.
- By Kode Mohan Sai Published Date - 03:41 PM, Sat - 14 December 24

RCB New Captain: ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెగా వేలానికి ముందు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. తమ కెప్టెన్ డుప్లెసిస్ ను సైతం ఆర్సీబీ వదలేసింది. దీంతో కొత్త కెప్టెన్ గా విరాట్ కోహ్లీకే మళ్ళీ పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం కూడా వచ్చింది. అయితే ఆర్సీబీకి ఇప్పుడు మరో కెప్టెన్సీ ఆప్షన్ కూడా దొరికింది. డుప్లెసిస్ స్థానంలో పటిదార్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సూపర్ ఫామ్ తో దూసుకెళుతున్న ఈ యంగ్ ప్లేయర్ ఆర్సీబీ కెప్టెన్సీ రేస్ లో ముందున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పటిదార్ అదరగొడుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో మధ్యప్రదేశ్ ను ఫైనల్ కు చేర్చాడు.
ముఖ్యంగా ఫైనల్లో మెరుపు బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్.. రజత్ పాటిదార్ రెచ్చిపోవడంతో 15.4 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. రజత్ పాటిదార్ 29 బంతుల్లో 4 ఫోర్లు, అర 12 సిక్సర్లతో 66 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ టోర్నీలో మధ్యప్రదేశ్ కు సారథిగా అద్భుత విజయాలను అందించాడు. ఆడిన 9 మ్యాచ్ లలో 8 మ్యాచ్ లలో గెలిపించాడు. అటు వ్యక్తిగతంగానూ అదరగొట్టేశాడు. 9 మ్యాచ్ లలో 49 యావరేజ్ తో 347 పరుగులు చేశాడు. దీనిలో 4 హాఫ్ సెంచరీలున్నాయి. అతని కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఆకట్టుకోవడంతో ఆర్సీబీ పటిదార్ ను సారథిగా నియమించే ఛాన్సుంది. మెగావేలానికి ముందే పటిదార్ ను బెంగళూరు ఫ్రాంచైజీ 11 కోట్లతో రిటైన్ చేసుకుంది.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో పాటిదార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఫస్ట్ హాఫ్‌లో నిరాశపరిచిన పాటిదార్.. సెకెండ్ హాఫ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 15 మ్యాచ్‌లు ఆడి 398 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీకి కోహ్లీ, పటిదార్ కాకుండా కృనాల్ పాండ్యా , భువనేశ్వర్ కుమార్, జితేశ్ శర్మ రూపంలో మరికొన్ని కెప్టెన్సీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పటివరకు 17 సీజన్ లు జరిగినా బెంగళూరు జట్టుకు ఒక్క టైటిల్ నెగ్గలేకపోయింది.