Haris Rauf Injured: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడికి ఛాతీ నొప్పి!
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా లాహోర్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
- By Gopichand Published Date - 02:18 PM, Sun - 9 February 25

Haris Rauf Injured: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు పాకిస్తాన్ స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో ముక్కోణపు సిరీస్ ఆడుతోంది. ఈ ముక్కోణపు సిరీస్‌లో భాగంగా లాహోర్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. అయితే ఇది పాకిస్థాన్‌కు ఊహించని ఓటమి. ఎందుకంటే స్వదేశంలో ఆడుతున్నప్పుడు పాకిస్థాన్ ఇంత భారీ తేడాతో ఓడిపోవడం ఇదే తొలిసారి. అయితే ఛాంపియన్స్ టోర్నీకి ముందు పాకిస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
మ్యాచ్ విన్నింగ్ బౌలర్ గాయపడ్డాడు
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ స్టార్ బౌలర్ హరీస్ రవూఫ్ (Haris Rauf Injured) గాయపడ్డాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో జరిగింది. హారిస్ 37వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. రెండో బంతి వేస్తున్న సమయంలో అతనికి ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హరీస్ మైదానం వీడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో రవూఫ్ 6.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అతనికి తేలికపాటి సైడ్ స్ట్రెయిన్ ఉన్నట్లు సమాచాం. వైద్య బృందం అతనిని పర్యవేక్షిస్తోంది. సమాచారం మేరకు రవూఫ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
పాక్‌లో ముక్కోణపు సిరీస్
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా లాహోర్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. జట్టు తరఫున గ్లెన్ ఫిలిప్స్ 74 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేన్ విలియమ్సన్ 58 పరుగులతో, డారిల్ మిచెల్ 81 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. లక్ష్య చేధనలో పాక్ జట్టు 47.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. 78 పరుగుల తేడాతో ఓడిపోయింది.