Natasa Flying To Serbia: హార్దిక్ విడాకులు నిజమేనా..? కొడుకుతో కలిసి సెర్బియాకు పయనమైన నటాషా..!
నటాషా (Natasa Flying To Serbia) తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నటాషా తన కుమారుడు అగస్త్యతో విమానాశ్రయంలో కనిపించింది.
- By Gopichand Published Date - 12:11 PM, Wed - 17 July 24

Natasa Flying To Serbia: హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్‌ల విడాకుల వార్తలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు హార్దిక్ లేదా నటాషా విడాకుల గురించి నోరు విప్పలేదు. ఒకవైపు హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ 2024లో సందడి చేయగా.. మరోవైపు అతని విడాకుల వార్త సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు నటాషా (Natasa Flying To Serbia) తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నటాషా తన కుమారుడు అగస్త్యతో విమానాశ్రయంలో కనిపించింది. ఈ వీడియో బయటకు రావడంతో మరోసారి విడాకుల వార్తలు ఊపందుకున్నాయి.
నటాషా తాజా ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారాయి
నటాషా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని తాజా చిత్రాలను కూడా పంచుకుంది. ఈ చిత్రాలలో నటాషా తన బ్యాగ్ ప్యాక్ చేస్తున్నప్పుడు ఫొటో పంచుకుంది. దీనితో పాటు నటాషా ఫోటోపై ఇల్లు, విమాన ఎమోజీని కూడా ఉంచింది. దీనితో పాటు నటాషా ఫోటోపై రాసింది. ఈ సంవత్సరంలో సమయం దొరికింది అని పేర్కొంది.
Also Read: KL Rahul: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై వేటు..?
నటాషా ఈ పోస్ట్ తర్వాత ఆమె తన కుమారుడు అగస్త్యతో విమానాశ్రయంలో కనిపించింది. అయితే ఎయిర్‌పోర్టులో నటాషా ఆమె కుమారుడు అగస్త్య మాత్రమే కనిపిస్తున్నారు. వీడియో బయటపడిన తర్వాత హార్దిక్‌ను విడిచిపెట్టి నటాషా తన కొడుకు అగస్త్యతో ఎక్కడికి వెళుతోంది అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో తలెత్తాయి. కాగా, నటాషా తన కొడుకుతో కలిసి సెర్బియా దేశానికి వెళుతోందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే పాండ్యా- నటాషా మధ్య అన్ని సర్ధుబాటు అయ్యాయని ఇంకా నటాషా- పాండ్యా కలిసేది లేదని కొన్ని నివేదికలు బయటకు వచ్చాయి.
We’re now on WhatsApp. Click to Join.
శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతున్న హార్దిక్
టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియాను ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు శ్రీలంక టూర్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ టూర్‌లో జరిగే టీ20 సిరీస్‌లో హార్దిక్‌ను టీమిండియా కెప్టెన్‌గా నియమించవచ్చు. కానీ నివేదికల ప్రకారం.. పాండ్యాను కెప్టెన్‌గా చేయడానికి టీమ్ ఇండియా కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అనుకూలంగా లేడు. అయితే శ్రీలంక టూర్‌కు సంబంధించి టీం ఇండియాను ఇంకా ప్రకటించలేదు. మరోవైపు పాండ్యా శ్రీలంక వన్డే సిరీస్‌లకు అందుబాటులో ఉండలేనని, తనకు విశ్రాంతి కావాలని బీసీసీఐని కోరినట్లు నివేదికలు వచ్చిన విషయం తెలిసిందే.