KL Rahul: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై వేటు..?
ఈ ఏడాది IPLలో ఓ మ్యాచ్ LSG యజమాని సంజీవ్ గోయెంకా KL రాహుల్ (KL Rahul)పై కోపంగా కనిపించాడు. ఆ సమయంలో ఆ విషయం చాలా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
- By Gopichand Published Date - 09:47 AM, Wed - 17 July 24

KL Rahul: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈసారి మెగా వేలం జరగనుంది. ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నారు. జట్లు చాలా పెద్ద మార్పులు చేయగలవని చెబుతున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) కెప్టెన్ కెఎల్ రాహుల్‌ను తొలగించాలనే చర్చ కూడా జరుగుతోంది. నిజానికి ఈ ఏడాది IPLలో ఓ మ్యాచ్ LSG యజమాని సంజీవ్ గోయెంకా KL రాహుల్ (KL Rahul)పై కోపంగా కనిపించాడు. ఆ సమయంలో ఆ విషయం చాలా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సంజీవ్ గోయోంకాపై కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ అలాగే మాజీ క్రికెటర్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే సంజీవ్ జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కెఎల్ రాహుల్‌ను కెప్టెన్సీ నుండి తప్పించవచ్చు లేదా రాహులే స్వయంగా జట్టుకు గుడ్ బై చెప్పవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేఫథ్యంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీకి సంబంధించి లక్నో జట్టు ఆటగాడు పెద్ద హింట్ ఇచ్చాడు.
Also Read: Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్.. పాంటింగ్ బాటలోనే పంత్..?
"LSG will look for a better captain than KL Rahul" says Amit Mishra. pic.twitter.com/UzF2id2CVF
— Jyotirmay Das (@dasjy0tirmay) July 15, 2024
LSG మెరుగైన కెప్టెన్ కోసం చూస్తుంది: మిశ్రా
యూట్యూబర్ శుభంకర్ మిశ్రా LSG ప్లేయర్ అమిత్ మిశ్రాను తాజాగా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో KL రాహుల్ వచ్చే ఏడాది జట్టుకు కెప్టెన్‌గా ఉంటారా లేదా అతన్ని తొలగిస్తారా అని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా అమిత్ మిశ్రా మాట్లాడుతూ.. లక్నో సూపర్ జెయింట్స్ మెరుగైన కెప్టెన్ కోసం వెతుకుతుందని భావిస్తున్నాను. కేఎల్ రాహుల్ 100 శాతం బ్యాట్స్‌మన్ కెప్టెన్‌గా కనిపిస్తాడని పేర్కొన్నాడు. మిశ్రా ఇచ్చిన ఈ సూచన LSG కెప్టెన్ కోసం వెతుకుతున్నట్లు స్పష్టం చేసింది. ఇదే నిజమైతే కేఎల్ రాహుల్‌పై వేటు తప్పదనే విషయం తెరమీదకి వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఘోర పరాజయం తర్వాత సంజీవ్ గోయెంకా- KL రాహుల్ మధ్య వాడివేడిగా సంభాషణ జరిగింది. సంజీవ్.. కెఎల్‌తో పరుషంగా మాట్లాడటం కనిపించింది. అయితే ఈ విషయంపై అమిత్ మిశ్రా మాట్లాడుతూ.. అక్కడ పెద్దగా ఏమీ జరగలేదు. మీడియా మొత్తం విషయాన్ని తనదైన రీతిలో అతిశయోక్తి చేసిందని చెప్పాడు.
మిశ్రా మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన పట్ల సంజీవ్ గోయెంకా నిరాశకు గురయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడిపోయాం. KKRపై 90-100 పరుగుల తేడాతో ఓడిపోయాం. కాగా SRHతో జరిగిన మ్యాచ్ కేవలం 10 ఓవర్లలోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో వారి బ్యాటింగ్ చూస్తుంటే ప్రాక్టీస్ సెషన్‌లో బౌలింగ్ చేస్తున్నట్లు ఉందని సంజీవ్.. రాహుల్‌తో చెప్పినట్లు మిశ్రా తెలిపాడు.