Hardik Pandya: హార్థిక్ అప్పుడే అంత తలకెక్కిందా?
భారత క్రికెట్ జట్టులో గత రెండేళ్ళుగా కెప్టెన్సీకి సంబంధించి ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యూజికల్ ఛైర్ తరహాలో కెప్టెన్లీ మారుతూ వస్తున్నారు.
- Author : Naresh Kumar
Date : 18-03-2023 - 1:38 IST
Published By : Hashtagu Telugu Desk
భారత క్రికెట్ జట్టులో గత రెండేళ్ళుగా కెప్టెన్సీకి సంబంధించి ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యూజికల్ ఛైర్ తరహాలో కెప్టెన్లీ మారుతూ వస్తున్నారు. కోహ్లీ నుంచి పగ్గాలు రోహిత్ కే అప్పగించినా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చిన్న సిరీస్ లకు పలువురు కెప్టెన్లను మారుస్తూ వచ్చింది బీసీసీఐ. వైస్ కెప్టెన్లను కూడా తరచుగా మారుస్తోంది. ప్రస్తుతం ఆసీస్ తో తొలి వన్డేకు రోహిత్ దూరమవడంతో హార్థిక్ పాండ్యాకు (Hardik Pandya) సారథ్య బాధ్యతలు అప్పగించారు. అయితే ఫ్యూచర్ కెప్టెన్ గా భావిస్తున్న హార్థిక్ ప్రవర్తన మాత్రం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఆల్ రౌండర్ సీనియర్లను పట్టించుకోని విధంగా వ్యవహరిస్తున్నాడన్న వాదన వినిపిస్తోంది. అప్పుడప్పుడూ గ్రౌండ్ లో జరుగుతున్న ఘటనలే దీనికి మరింత బలాన్నిస్తున్నాయి. తాజాగా ఆసీస్ తో తొలి వన్డేలో హార్థిక్ ప్రవర్తనపై అభిమానులు మండిపడుతున్నారు.
ఆసీస్ ఇన్నింగ్స్ 21వ ఓవర్ బౌలింగ్ చేయడానికి కుల్దీప్ యాదవ్ వచ్చినప్పుడు.. విరాట్ కోహ్లీ ఫీల్డ్‌లో మార్పు చేయాలని హార్దిక్‌కు సూచించాడు. అయితే హార్దిక్ మాత్రం విరాట్ మాటలను కొంచెం కూడా పట్టించుకోకుండా దూరంగా వెళ్లిపోయాడు. వెంటనే కోహ్లి కూడా హార్దిక్‌ను ఉద్దేశించి కోపంగా ఏదో అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా నిలిచిన కోహ్లిని.. హార్దిక్ ఈ విధంగా అవమానించడాన్ని విరాట్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఎంత కెప్టెన్ అయినా, సీనియర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడుతున్నారు. హార్థిక్ (Hardik Pandya) అప్పుడే ఇంత తలకెక్కిందా అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.గతంలోనూ హార్థిక్ ఆన్ ఫీల్డ్ ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. కెప్టెన్ అనే వ్యక్తి అందరినీ కలుపుకుని పోకుంటే సమస్యలు ఎదురవుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Also Read: Re-Entered to Facebook: ఫేస్‌బుక్‌లోకి రీఎంట్రీ చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్!