HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Hardik Pandya Has Ligament Tear Likely To Miss More Games

Hardik Pandya: టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కూ హార్దిక్‌ పాండ్యా దూరం..!

2023 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) గాయపడడం భారత జట్టు కష్టాలను మరింత పెంచింది. అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు.

  • Author : Gopichand Date : 26-10-2023 - 10:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hardik Pandya
Hardik Pandya

Hardik Pandya: 2023 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) గాయపడడం భారత జట్టు కష్టాలను మరింత పెంచింది. అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. గాయంతో పాండ్యా వెంటనే మైదానం వీడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా పాండ్యా కనిపించలేదు. తదుపరి ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా పునరాగమనానికి సంబంధించి ఇప్పుడు తాజా అప్‌డేట్ వచ్చింది. హార్దిక్ పాండ్యా రాబోయే చాలా మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే టీమ్ ఇండియా పాండ్యా భర్తీ గురించి ఆలోచించడం లేదని, నాకౌట్‌లో హార్దిక్ పునరాగమనం కోసం వేచి చూస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి.

టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తల ప్రకారం.. హార్దిక్ తన చీలమండలో గ్రేడ్ 1 లిగమెంట్ టియర్‌తో బాధపడుతున్నాడు. దీని కారణంగా న్యూజిలాండ్ తర్వాత అతను ఇంగ్లాండ్, శ్రీలంకతో జరగబోయే మ్యాచ్‌లకు కూడా దూరం కావచ్చు. ‘బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో నితిన్ పటేల్ నేతృత్వంలోని వైద్య బృందం పాండ్యాని పర్యవేక్షిస్తోంది. కానీ గాయం మొదట అనుకున్నదానికంటే చాలా తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అతను ఒక చిన్న స్నాయువు గాయంతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది సాధారణంగా నయం కావడానికి కనీసం రెండు వారాలు పడుతుంది. అతని గాయం నయం కాకముందే NCA అతన్ని విడుదల చేయదు. అతను త్వరలో మైదానంలోకి వస్తాడనే ఆశాభావంతో ఉన్నామని వైద్య బృందం టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలిపిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

Also Read: Team India: లక్నో చేరుకున్న టీమిండియా.. 29న ఇంగ్లండ్‌తో భారత్ ఢీ..!

పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు భారత జట్టు తొందరపడటం లేదు. దీంతో ఇంగ్లండ్ తో జరిగే తదుపరి మ్యాచ్ కు హార్దిక్ అందుబాటులో ఉండే అవకాశం లేదని స్పష్టమవుతోంది. భారత జట్టు బుధవారం లక్నో చేరుకుంది. టీమిండియా మొదటి ప్రాక్టీస్ సెషన్ గురువారం జరుగుతుంది. నవంబర్ మొదటి వారంలో శ్రీలంక, దక్షిణాఫ్రికాతో భారత్ తదుపరి రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ లకు కూడా హార్దిక్ పునరాగమనం చేయడం కష్టమే.

We’re now on WhatsApp. Click to Join.

పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానంలో ఉంది. టీమిండియా ఐదు మ్యాచ్‌లు ఆడింది. నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లను కూడా ఓడించింది. ఇంగ్లండ్ తర్వాత భారత్ శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cricket World Cup 2023
  • Hardik Pandya
  • Hardik Pandya Injury
  • ICC World Cup 2023
  • IND vs ENG
  • world cup 2023

Related News

Hardik Pandya Dancing With GF Mahieka Sharma

మహీకా వచ్చాక నా జీవితంలో వరుస విజయాలు : హార్దిక్ పాండ్యా

Hardik Pandya  టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భవిష్యత్ గురించి మాట్లాడాడు. తాను ఇంకా కనీసం 10 ఏళ్లు భారత జట్టుకు ఆడాలని, ఈ కాలంలో మరిన్ని ఐసీసీ ట్రోఫీలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. ఇప్పటివరకు తన కెరీర్ సగమే పూర్తయ్యిందని, మిగిలిన కాలంలో కనీసం 10 ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నానని వెల్లడించాడు. ఈ విజయ

  • IND vs NZ

    ఫైన‌ల్లోకి భార‌త్‌.. 7 ప‌రుగుల‌తో ఇంగ్లాండ్‌పై ఘ‌న విజ‌యం!

  • Rohit Sharma-Virat Kohli

    23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

  • Shivam Dube

    19 ఏళ్ల క్రితం ధోనీ.. ఇప్పుడు శివ‌మ్ దూబే!

  • India vs England

    ఇంగ్లాండ్‌తో సెమీ ఫైన‌ల్ పోరు.. చ‌రిత్ర సృష్టించిన భార‌త్‌!

Latest News

  • త్వరలో పెళ్లి పీటలెక్కనున్న టీమ్ ఇండియా ప్లేయర్..

  • TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

  • Good News : డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు.. త్వరలో మరో పథకం అమలు

  • Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. గుండెపోటు డ్రామా వెనుక భయంకరమైన నిజం

  • ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

Trending News

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd